నటిగానే కాక ప్రొడ్యూసర్ల గాను సత్తా చాటుతున్న స్టార్ హీరోయిన్లు వీళ్లే..!

సాధారణంగా సినీ ఇండస్ట్రీలో కొంతమంది హీరోలు నటనతో పాటు కొన్ని సందర్భాల్లో నిర్మాత, దర్శకత్వ బాధ్యతలు కూడా వహిస్తారు. అది కేవలం హీరోలకి మాత్రమే సాధ్యమవుతుంది. కానీ తాజాగా హీరోయిన్లు కూడా నటనతో పాటు నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. వారెవరు ఇప్పుడు చూద్దాం.

కృతి సనన్:


ఈమె సరికొత్త ప్రొడక్షన్ హౌస్ ప్రారంభించింది. బ్లూ బటర్ ఫ్లై ఫిలింను స్టార్ట్ చేసి దో పత్తి అనే చిత్రాన్ని తరికెక్కించింది. కాజోల్‌తో కలిసి కృతి సనన్ కూడా నటిస్తుంది. ఈ చిత్రం నేరుగా ఓటీటీలో విడుదల కానుంది.

అలియా భట్:


ఆల్రెడీ డార్లింగ్ చిత్రాని తెరకెక్కించింది ఆలియా భట్. అటర్నల్ సన్ షైన్ ప్రొడక్షన్ అని వెతికి మరీ పేరు పెట్టుకుంది. నటిగా బిజీగా ఉన్నప్పటికీ…. నిర్మాతగా మంచి ప్రాజెక్టులు చేయాలని సంకల్పంతో ఉంది ఆలియా భట్.

కంగనారనౌత్:


ఈమె పేరు చెప్పగానే మణికర్ణిక మూవీ గుర్తుకొస్తుంది. మణికర్ణిక ఫిలిం బ్యానర్ మీదనే ఎమర్జెన్సీ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. మిగిలిన బ్యానర్స్ లోనే కాదు సొంత బ్యానర్ లో కూడా నటిగా కంటిన్యూ అవుతుంది.

నయనతార:


భర్త విఘ్నేష్ శివన్ తో కలిసి నయనతార కూడా కంటిన్యూస్ సినిమాలు చేస్తుంది. రౌడీ పిక్చర్స్ బ్యానర్ కి కోలీవుడ్ లో మంచి పేరు ఉంది. రీసెంట్ గా కేఆర్ కే మూవీ అదే బ్యానర్ పై తెరకెక్కించారు.

తాప్సి:


ఔట్ సైడ్ర్స్ ఫిలిమ్స్ అనే బ్యానర్ ని స్టార్ట్ చేసింది తాప్సి. ఇండస్ట్రీలోకి వచ్చి పదేళ్లు అయినా సందర్భంగా ప్రొడక్షన్ హౌస్ గురించి ఆలోచించినట్లు తెలిపింది తాప్సి. ఈ బ్యానర్ మీదనే బ్లర్ చిత్రాన్ని తెరకెక్కించారు. కాస్త అడపా దడపా పలువురు హీరోయిన్లు నిర్మాతలుగా మారుతున్న… వీరు మాత్రం డెడికేటెడ్‌గా సినిమాలను తీస్తామని పదేపదే చెప్పడం విశేషం.