టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క ఇండస్ట్రీకి కొంతకాలం గ్యాప్ తర్వాత మళ్లీ వెండి తెరపై కనిపించబోతుంది. నవీన్ పోలిశెట్టి హీరోగా, అనుష్క శెట్టి హీరోయిన్గా నటించిన మిస్‌శెట్టి మిస్టర్ పోలిశెట్టి త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉంది. ఈ సినిమాను ఇదిగో అదిగో అంటూ అటూ ఇటూ జరుపుతూ ఇప్పటి వరకు రిలీజ్ చేయలేదు. అయితే ఇక రిలీజ్ డేట్ వచ్చేసింది. ట్రైలర్ కోసం జనం ఆసక్తిగా ఎదురు చూస్తున్న టైం లో తాజాగా ట్రైలర్ ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
ఇప్పటికే ఈ సినిమా స్టోరీ లైన్ ఏంటి అనేది చాలామంది ప్రేక్షకులకు అర్థమైపోయింది. పెళ్లి వద్దు, పిల్లలు వద్దు అనుకునే అమ్మాయి.. అందుకోసం ఎంచుకున్న కుర్రాడికి మధ్య జరిగే రొమ్యాన్స్, డ్రామా, గోడవలు ఈ 3 ట్రైలర్ లో క్లియర్ కట్ గా చూపించారు. నవీన్ మార్క్ కామెడీ డైలాగ్స్, అనుష్క చెమ్మకులు, కలర్ఫుల్ పిక్చర్ కలిసి ట్రైలర్‌ను ఇంట్రెస్టింగ్‌గా చేంజ్ చేశాయి.
యూత్ ఫుల్ ఎంటర్టైనర్‌గా హుషారైనా చాలా డైలాగులు ట్రైలర్లో పడ్డాయి. క్లైమాక్స్‌లో ఎమోషనల్ టచ్ ఉంటుందేమో అని సందేహం వచ్చేలా ట్రైలర్లో జస్ట్ అలా టచ్ చేసి వదిలారు. మొత్తం మీద ట్రైలర్ అయితే సినిమా మీద మంచి హైప్‌ని పెంచేలా ఉంది. ఈ మేరకు ట్రైలర్ కంటెంట్ను అందించడంలో మహేష్ విజయం సాధించాడని చెప్పాలి. ఈ సినిమా యూవీ క్రియేషన్స్ బ్యానర్ పై రూపొందింది.