మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే ఆల్ టైం సూపర్ హిట్ సాంగ్స్ ఇవే.. లిస్టు చూస్తే మతులు పోవాల్సిందే..!

మన తెలుగు చిత్ర పరిశ్రమలో మెగాస్టార్ చిరంజీవి పేరుకు ఎంతటి క్రేజ్ ఉందో అందరికీ తెలిసిందే. నాలుగు దశాబ్దాలకు పైగా చిత్ర పరిశ్రమలో కొనసాగుతున్న చిరంజీవి ఇప్పటికీ బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వస్తూ నేటితరం హీరోలకు గట్టి పోటీ ఇస్తున్నాడు. అలాంటి మెగాస్టార్ చిరంజీవి ఇప్పటికే 150కు పైగా సినిమాల్లో నటించాడు. చిరు నటించిన సినిమాల్లో ఎన్నో ఇండస్ట్రీ హిట్లు సూపర్ హిట్ సినిమాలు ఉన్నాయి.

 

అదేవిధంగా తన కెరీర్ లో ఎన్నో ఎత్తు పల్లాలు చూసిన చిరు. ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమకే పెద్దదిక్కుగా మారాడు. అదే విధంగా చిరంజీవి తన కెరీర్లో హిట్ సినిమాలు తో పాటు ప్లాప్ సినిమాలు కూడా ఉన్నాయి. ఆగస్టు 22న 1955లో ఆంధ్రప్రదేశ్‌లోని మొగల్తూరులో చిరు జన్మించారు. చిరంజీవి అసలు పేరు శివశంకర్ వరప్రసాద్. ఆంజనేయస్వామి భక్తుడైన మెగాస్టార్‌కు ఇండస్ట్రీలో చిరంజీవిగా ముద్రపడిపోయింది. ఆగస్టు 22, 2023న ఆయన బర్త్‌ డే సందర్భంగా మెగాస్టార్ కేరీర్‌లోనే ఆల్‌ టైమ్ హిట్‌ సాంగ్స్‌ ఏమిటో ఇక్కడ చూద్దాం.

1. చమక్‌ చమక్‌ చాం – కొండవీటి దొంగ – విజయంశాంతి

2. రెడ్ రెడ్ బుగ్గే రెడ్ సిగ్గె రెడ్ చూశా- అల్లుడా మజాకా – రంభ

3. రగులుతోంది మొగలిపొద- ఖైదీ- మాధవి

4. భద్రాచలం కొండ సీతమ్మవారి దండ- గ్యాంగ్ లీడర్- విజయశాంతి

5. బంగారు కోడిపెట్ట వచ్చేనండి- ఘరానా మొగుడు- డిస్కో శాంతి

6. మంచమేసి.. దుప్పటేసి.. మల్లెపూలు చల్లానురా- కొండవీటి రాజా- విజయశాంతి

7. ఇందువదన కుందరదన – ఛాలెంజ్- విజయశాంతి

8. సందె పొద్దులకాడ – అభిలాష- రాధిక శరత్‌కుమార్

9. మళ్లీ మళ్లీ ఇది రాని రోజు – రాక్షసుడు- సుహాసిని

10. సిన్ని సిన్ని కోరికలడగ – స్వయంకృషి- విజయశాంతి

11. నమ్మకు నమ్మకు ఈ రేయిని -రుద్రవీణ- శోభన

12. జై చిరంజీవ జగదేకవీరా.. – జగదేకవీరుడు అతిలోక సుందరి- శ్రీదేవి

13. చుక్కల్లారా చూపుల్లారా – ఆపద్బాంధవుడు- మీనాక్షి

14. దాయి దాయి దామ్మ- కులుకే కుందనాల బొమ్మ- ఇంద్ర- సోనాలి బింద్రే

15. ఏ ఛాయ్ చటుక్కున తాగరా భాయ్- మృగరాజు- సిమ్రాన్

16. కొడితే కొట్టాలిరా సిక్స్ కొట్టాలి.. – ఠాగూర్- జ్యోతిక, శ్రియాశరణ్

17. వానా వానా వెల్లువాయే.. కొండకొన తుల్లిపోయే- గ్యాంగ్ లీడర్- విజయశాంతి

18. ఆంటీ కుతురా.. అమ్మో అప్సరా.. ముస్తాబు అదిరింది- బావగారు బాగున్నారా?- రంభ

19. బంగారం తెచ్చి.. వెండి వెన్నెల్లో ముంచి- ఇద్దరు మిత్రులు