ప‌వ‌న్ హీరోయిన్ గ‌దిలో సీక్రెట్ కెమేరాలు.. ఇంత చేదు అనుభ‌వ‌మా…!

బాలీవుడ్ స్టార్ బ్యూటీ కృతికర్బంధ ‘ బోని ‘ సినిమాతో టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. కెరీర్ స్టార్టిండ్‌లో సౌత్ సినిమాల్లో బాగా మెరిసిన ఈ ముద్దుగుమ్మ తెలుగుతోపాటు కన్నడలోనూ ఎక్కువ సినిమాలలో నటించింది. ఆ తర్వాత బాలీవుడ్ అవకాశాలు దక్కించుకుని అక్కడే సెటిలైపోయింది. తెలుగులో కృతికరబంద.. సుమంత్ బోనీ సినిమాతో పాటు నాని అలా మొదలైంది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తీన్మార్, అలాగే మిస్టర్ నూకయ్య, ఒంగోలు గిత్త, హోం త్రీ డి, బ్రూస్‌లీ సినిమాలలో నటించి మెప్పించింది.

టాలీవుడ్ లో తన అందం, అభినయంతో మంచి క్రేజ్‌ సంపాదించుకున్న కృతి ప్రస్తుతం సౌత్ సినిమాలకు దూరంగా ఉంటుంది. అటు బాలీవుడ్‌లోను రెండు సంవత్సరాలుగా ఎటువంటి సినిమాల్లో నటించలేదు. తెలుగు, హిందీలో కంటే కన్నడలోనే ఎక్కువ సినిమాల్లో నటించిన ఈ ముద్దుగుమ్మ కన్నడలో ఓ సినిమా చేస్తుండగా తనకు ఎదురైనా ఓ చేదు ఘటన గురించి తాజాగా ఓ ఇంటర్వ్యూలో వివరించింది. ఆమె మాట్లాడుతూ నేను కన్నడ మూవీ షూటింగ్ చేస్తున్న టైంలో నాకు హోటల్ రూమ్ అరేంజ్ చేశారని.. అక్కడే పని చేసే వ్యక్తి నా రూమ్ లో సీక్రెట్ గా కెమెరా పెట్టారు అంటూ వివ‌రించింది.

నేను స్టే చేసే రూమ్ లో చెక్ చేసుకోవడం నాకు నా టిమ్‌కి అలవాటు అలా నా గదిని మొత్తం పరిశీలించగా సెటప్ బాక్స్ వెనకాల కెమెరా చూసాం అది చూసి మాకు షాక్ గా అనిపించింది అప్పటినుంచి ఎక్కడ బస చేయాలన్నా చాలా కేర్ తీసుకుంటున్నాను అని వివరించింది. ఇక గ‌త‌ కొంతకాలంగా ఏ సినిమాల్లో కృతి నటించడం లేదు. చివరిగా 14 ఫెయిర్ బాలీవుడ్ సినిమాలో నటించిన కృతి ప్రస్తుతం సోషల్ మీడియాలో మాత్రమే సందడి చేస్తుంది. ప్రస్తుతం కృతి నటుడు పుల్కిత్ సామ్రాట్ తో రిలేషన్ షిప్ లో ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.