యంగ్ టైగర్ ఎన్టీఆర్ కారణంగానే దిల్ రాజు కెరీర్ మారిందా.. ఎవరికీ తెలియని టాప్ సీక్రెట్ ఇదే..!

మన తెలుగు తెలుగు చిత్ర పరిశ్రమలోనే ప్రస్తుతం నెంబర్ వన్ ప్రొడ్యూసర్ ఎవరనే ప్రశ్నకు ఎక్కువ మంది దిల్ రాజు పేరునే చెబుతూ ఉంటారు. దిల్ రాజు నిర్మించిన మెజారిటీ సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద మంచి విజయాలు సాధించడంతో పాటు డిస్ట్రిబ్యూటర్ గా సైతం దిల్ రాజు తన కెరీర్ ను ఎంతో విజయవంతంగా కొనసాగిస్తున్నాడు. ప్రస్తుతం దిల్ రాజు పాన్ ఇండియా సినిమాలను నిర్మిస్తూ కెరీర్లో ఎంతో బిజీగా కొనసాగుతున్నాడు.

ఇక రాబోయే రోజుల్లో ప్రభాస్, ఎన్టీఆర్ తో కూడా సినిమాలు చేయాలని ప్లాన్ చేస్తున్నారు. అదేవిధంగా ఎంతోమంది కొత్త దర్శకులను టాలీవుడ్ కి పరిచయం చేసిన దిల్ రాజు ఆదర్శకుల సక్సెస్ అవటంలో కూడా ఎంతో కీలక పాత్ర పోషించాడు. ఈ విధంగా దిల్ రాజు తన పేరును టాలీవుడ్ కే బ్రాండ్ గా మార్చుకున్నాడు. అయితే దిల్ రాజు తన కెరీర్ లో ఇంత సక్సెస్ సాధించడంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ పాత్ర ఉందనే విషయం చాలామందికి తెలియదు.

ముందుగా ఎన్టీఆర్- వి.వి.వినాయక్ కాంబినేషన్లో వచ్చిన ఆది సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఎంతటి ఘన విజయం సాధించిందో అందరికీ తెలిసిందే. ఇక ఈ సినిమాలో ఎన్టీఆర్ చిన్నప్పటి పాత్ర బాంబులు వేసే సీన్, సుమోలు లేపే సీన్స్ ఎంతో హైలెట్గా నిలిచాయి. అయితే వాస్తవానికి ఈ రెండు సీన్లు చెప్పి దర్శకుడు వినాయక్ ఎన్టీఆర్ ను ఈ సినిమాలో నటించడానికి ఓపించారట. అయితే ఈ సినిమాకు దిల్ రాజు కొన్ని ఏరియాలో డిస్ట్రిబ్యూషన్ చేశారు. ఈ సినిమాకు ముందు దిల్ రాజు డిస్ట్రిబ్యూషన్ చేసిన పలు సినిమాలు ఆశించిన ఫలితాలు అయితే ఇవ్వలేదు.

అయితే ఆది సినిమాతో వచ్చిన సక్సెస్ తో దిల్ రాజు దశ తిరిగింది. ఈ విధంగా దిల్ రాజు కెరీర్ సక్సెస్ లో జూనియర్ ఎన్టీఆర్ పాత్ర ఎంతో ప్రముఖంగా మారింది. ఆది సినిమాను వినాయక్ అద్భుతంగా తీయడంతో దిల్ రాజు వినాయక్ తో దిల్ సినిమాను నిర్మించి నిర్మాతగా కెరీర్ ను మొదలుపెట్టి సౌత్ ఇండియాలో సత్తా చాటుతున్నారు. దిల్ రాజుకు సొంతంగా థియేటర్లు ఉండటంతో ఆయా థియేటర్ల ద్వారా కూడా కళ్లు చెదిరే స్థాయిలో లాభాలు వస్తున్నాయి.