విలన్లుగా ఎంట్రీ ఇచ్చి స్టార్ హీరోలు అయిన నటులు వీళ్ళే..!

డాక్టర్ అవ్వాల్సిన వాడు యాక్టర్ అయ్యాడు అంటూ చిత్ర పరిశ్రమలో ఎప్పుడు ఒక మాట వినిపిస్తూ ఉంటుంది. అలాగే హీరో అవ్వాలని చిత్ర పరిశ్రమంలో అడుగుపెట్టిన వారు విల‌న్లుగా మారిపోవడం కూడా జరుగుతుంది. విలన్లు అవ్వాల‌నుకున్న వాళ్లు హీరోలుగా రాణించి స్టార్ హీరోలుగా మారిన వారు కూడా చాల‌మంది ఉన్నారు. ఇక మ‌న టాలీవుడ్‌లో కూడా విలన్ గా కెరియర్ మొదలుపెట్టి ఆ తర్వాత హీరోగా అవతారం ఎత్తి సూపర్ హిట్లు సాధించి స్టార్ హీరోలు అయిన వాళ్లు కూడా ఉన్నారు.

Chiranjeevi, the megastar who beat Big B as India's highest paid actor - Hindustan Times

 

ఇలాంటి వారీలో చిరంజీవి, రజినీకాంత్ లాంటి సూపర్ స్టార్లతో పాటు నేటితరం హీరోలో గోపీచంద్ లాంటి హీరోలు కూడా విలన్‌గా కెరియర్ మొదలుపెట్టి హీరోగా రాణిస్తున్నారు.. అలా విల‌న్లుగా కెరీర్ మొద‌లు పెట్టి హీరోలు, స్టార్ హీరోలు అయిన వారు ఎవ‌రో ఇప్పుడు చూద్దాం.Free download Gopichand Latest Images Pics Full HD Pictures Galleries [1024x1536] for your Desktop, Mobile & Tablet | Explore 26+ Tottempudi Gopichand Wallpapers |

 

చిరంజీవి : టాలీవుడ్‌లో మీ ఫెవరేట్ హీరో ఎవరు ? అని అడిగితే ఎక్కువశాతం చెప్పే పేరు చిరంజీవి. ఎవరి సపోర్ట్ లేకుండా స్వయంకృషితో పైకి వచ్చిన చిరు.. కెరీర్ మొదట్లో అనేక సినిమాలలో ప్రతినాయకుడి పాత్రలో కనిపించాడు. కమల్‌హాసన్, జయసుధ జంటగా నటించిన ‘ఇది కథ కాదు’.. శోభన్‌బాబు, శ్రీదేవి జంటగా కలసి నటించిన ‘మోసగాడు’, ’47 రోజులు’, ‘న్యాయం కావాలి’, ‘తిరుగులేని మనిషి’ చిత్రాలలో విలన్‌గా నటించాడు.

మోహన్ బాబు : కలెక్షన్ కింగ్ గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న మోహన్ బాబు ఇప్పటికి 500 పైగా చిత్రాలలో నటించాడు. వాటిల్లో హీరో, విలన్ మరియు సపోర్టింగ్ రోల్స్ ఉన్నాయి. చిరంజీవి బాటలోనే మోహన్ బాబు కూడా ప్రతినాయకుడి పాత్రల్లో మెప్పించాడు.

रजनीकांत का जीवन परिचय | Rajinikanth Biography In Hindi

రజనీకాంత్ : ఆల్ ఇండియా సూపర్ స్టార్‌గా కొనసాగుతున్న రజనీకాంత్ కథా సంగమం, జాను, బాలు వంటి సినిమాల్లో విలన్ గా నటించి ఆ తర్వాతే హీరోగా ఎంట్రీ ఇచ్చి ఇప్పుడు ఏకంగా సౌత్ ఇండియ‌న్ సూప‌ర్ స్టార్ అయిపోయాడు.

Mohan Babu: 2010 cheque bounce case: Mohan Babu sentenced to 1-year imprisonment, asked to pay Rs 41.75 lakh fine

శ్రీకాంత్‌ : టాలీవుడ్‌లో యాంగ్రీ యంగ్‌మ్యాన్‌గా, స్టార్ హీరోగా హవా నడిపించిన సీనియ‌ర్ హీరో శ్రీకాంత్ కూడా ప్రెసిడెంట్ గారి పెళ్ళాం, అబ్బాయిగారు.. వారసుడు సినిమాల్లో విలన్ గా నటించి ఆ తర్వాతే హీరోగా కెరియర్ మొదలుపెట్టారు. వీళ్ళు మాత్రమే కాకుండా రాజ‌శేఖ‌ర్‌, శ్రీహరి, రవితేజ, గోపీచంద్ లాంటి ఎంతోమంది స్టార్ హీరోలు సైతం విలన్‌గా కెరీర్ స్టార్ట్ చేసి ఇప్పుడు స్టార్లుగా కొనసాగుతున్నారు.

Rajshekar As Villain In Teja's 'Aham' - Social News XYZ