యంగ్ హీరో అడవి శేష్ – సూపర్ స్టార్ కృష్ణ కాంబినేషన్లో మిస్ అయిన హిట్‌ సినిమా…!

టాలీవుడ్‌లో ఎన్నో క్రేజీ కాంబినేషన్ లో వచ్చిన సినిమాలు సూపర్ హిట్లు అవడం మనం చూస్తూనే ఉన్నాం. కొన్ని క్రేజీ కాంబినేషన్స్ సెట్స్‌ దాకా వచ్చి ఆగిపోయిన సినిమాలు కూడా ఉన్నాయి. అలాంటి కాంబినేషన్లో ఒక సినిమా మనం మిస్ అయ్యాం. యంగ్ హీరో అడవి శేష్‌ – సూపర్ స్టార్ కృష్ణ కాంబినేషన్లో ఒక సినిమా సెట్స్ వరకు వచ్చి ఆగిపోయిందట. ఇంతకీ ఏంటా సినిమా..? ఎందుకు ఆ క్రేజీ కాంబినేషన్లో మూవీ మనం మిస్ అయ్యామో ? ఒకసారి చూద్దాం.

Goodachari' Movie Twitter review

యంగ్ హీరో అడవి శేష్.. ఎలాంటి సినీ బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి వచ్చి ఒక్కో మెట్టు ఎదుగుతూ స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు. గూఢ‌చారి సినిమాతో బాక్సాఫీస్ వద్ద సంచలన రికార్డులు సృష్టించిన అడవి శేష్.. తర్వాత స్పై జానర్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారాడ‌న్న విషయం తెలిసిందే. అయితే ఈ సినిమాకు సీక్వెల్ గా గూఢ‌చారి 2 షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమా ఫస్ట్ గ్లింప్స్ కూడా ఇటీవల విడుదల చేశారు.

ఈ సినిమాలో ఒక చిన్న రోల్లో సూపర్ స్టార్ కృష్ణను నటించాల‌ని కోరారట మూవీ టీం. అయితే ఆయన అనారోగ్యంగా ఉండడంతో ఈ సినిమాకు నో చెప్పేసారట. కానీ తర్వాత కేవలం రెండు రోజుల షూటింగ్ మాత్రమే ఉంటుంది.. కూర్చుని డైలాగ్స్ పలికే పాత్ర మాత్రమే అని బ్రతిమలాడడంతో కృష్ణ ఈ సినిమాకు ఓకే చెప్పారట. బట్ దురదృష్టవశాత్తు ఆయన పెద్ద కొడుకు చనిపోవడం.. కొంతకాలానికి ఇందిరా దేవి చనిపోవడం జ‌రిగ్గాయి.

Goodachari (2018) - Photo Gallery - IMDb

దీంతో కృష్ణ గారి ఆరోగ్య పరిస్థితి మరింత దెబ్బతిందట. అయినప్పటికీ కృష్ణ గారు మాట ఇచ్చాను కాబట్టి కచ్చితంగా ఈ రెండు రోజులు కాల్ షీట్ ఇస్తానని చెప్పారట. కానీ ఆ తర్వాత ఆయనకు అనారోగ్యం మరింత విష‌మించ‌డంతో మృతిచెందారు. దాంతో సూపర్ స్టార్ కృష్ణ – అడవి శేష్ అభిమానులు ఈ క్రెడిట్ కాంబినేషన్ మిస్ అవ్వాల్సి వచ్చింది. ఈ వార్త ఇప్పుడు బ‌య‌ట‌కు రావ‌డంతో సూపర్ స్టార్ కృష్ణ ఫ్యాన్స్ ఆఖరి సారిగా తమ హీరోను తెరపై చూసే ఛాన్స్ మిస్ అయ్యామంటూ కామెంట్స్ చేస్తున్నారు.