పిల్లల ముందు తల్లిదండ్రులు చేయ‌కూడ‌ని ఆ 3 ప‌నులు ఇవే…!

చాణిక్యుడు చిన్న వాళ్ల దగ్గర నుంచి పెద్దవాళ్లు దగ్గర వరకు అందరి కోసం విలువైన మాటలు చెప్పాడు. మానవ జీవితం గురించి ఆయనకు గొప్ప అవగాహన ఉంది. చాణక్య నీతి జీవితానికి మార్గ నిర్దేశం చేస్తుంది. విజయం వైపు నడిపిస్తుంది. పిల్లల ముందు తల్లిదండ్రులు చేయకూడని పనులు గురించి చాణిక్యుడు చెప్పాడు. తల్లిదండ్రులు చేసేవి, చెప్పేవి బట్టి వారి పిల్లలు భవిష్యత్తు ఏర్పడుతుంది.

మీ పిల్లలతో మీరు ఎలా ప్రవర్తిస్తారో వారు భవిష్యత్తులో అలానే వ్యవహరిస్తారు. ప్రతి ఒక్కరూ తమ పిల్లల ముందు జాగ్రత్తగా ఆలోచించాలని చాణుక్యుడు తన చాణిక్య నీతిలో చెప్పాడు. ఎందుకంటే పిల్లలు చాలా సున్నితంగా ఎవరు ఏది చెబితే అది వింటారు. అందువల్ల పిల్లల ముందు మాట్లాడేటప్పుడు ఆ చిత్తుచి ఆలోచించి మాట్లాడాలి. వారు కూడా పెద్దయిన తర్వాత అలాగే మాట్లాడతారు.

చాణిక్య గ్రంథం ప్రకారం పిల్లల ముందు ఎటువంటి కించపరిచే పదాలు, దూషించే పదాలు ఉపయోగించకూడదు. ఇది భవిష్యత్తులో మీకు మీ పిల్లలకు మరింత తీవ్రమైన సమస్యలకు దారితీస్తాయి. పిల్లల భవిష్యత్తు కాపాడుకోవడం తమ బాధ్యత కాబట్టి పిల్లల ముందు చాలా గౌరవంగా మాట్లాడాలి. చాలామంది పిల్లల ముందు మాట్లాడేటప్పుడు పరువు, నైతిక విలువలు గురించి పట్టించుకోరు.

తల్లిదండ్రులు పిల్లల ముందు మాట్లాడేటప్పుడు ఇతరులు గురించి చాలా గౌరవంగా మాట్లాడాలి. అప్పుడే వారు పెద్దాయన తరువాత కూడా వారు కూడా అదే బాటలో పిల్లలు ముందు అబద్ధాలు ఆడకూడదని చాణిక్యుడు చెప్పాడు. వారి ముందు అబద్ధాలు ఆడినట్లయితే మీ అబద్ధాలలో వారిని కూడా కలిపినట్టు అవుతుంది. వారు కూడా మీకు అబద్ధాలు చెప్పడం ప్రారంభిస్తారు. అందువల్ల పిల్లల ముందు ఆచితూచి మాట్లాడుతూ ఎటువంటి అబద్ధాలు చెప్పకుండా ఉండండి.