టాలీవుడ్ లో స్టార్ హీరో మహేష్ బాబుకి అమ్మాయిల్లో ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నాలుగు దశాబ్దాల క్రితం చైల్డ్ ఆర్టిస్ట్ గా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన మహేష్ ఇప్పటికీ స్టార్ హీరోగా మంచి క్రేజ్‌తో కొనసాగుతున్నాడు. తండ్రి వారసత్వంగా ఇండస్ట్రికి అడుగు పెట్టిన అతి తక్కువ సమయంలోనే తనకంటూ గుర్తింపు సంపాదించుకున్నాడు. ఈ ఆగస్టు 9న మహేష్ తన 48వ ఎట అడుగుపెడుతున్న సందర్భంగా మహేష్ కు సంబంధించిన కొన్ని పర్సనల్ విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
మహేష్ బాబు రాజకుమారుడు సినిమాతో హీరోగా ఇండస్ట్రీకి అడుగు పెట్టిన సంగతి తెలిసిందే. ఈ సినిమా తో సక్సెస్ సాధించిన మహేష్ బాబు తర్వాత వంశీ , యువరాజు సినిమాల్లో నటించాడు. వంశీ సినిమాలో నమ్రతతో కలిసి నటించిన మహేష్ బాబు ఆమెతో ప్రేమలో పడ్డాడు వీరిద్దరూ ఒకరినొకరు 5 సంవత్సరాలు ప్రేమించుకున్న తర్వాత వీళ్ళు తమ ప్రేమ విషయం ఇంట్లో చెప్పారు. కానీ వీరి ప్రేమను కృష్ణ అంగీకరించలేదట.
దీనికి కారణం కృష్ణ మహేష్ బాబుకు ఒక అచ్చు తెలుగు అమ్మాయిని చూసి పెళ్లి చేద్దాం అనుకోవడమేనట. కానీ మహేష్ బాబు తల్లి కృష్ణను ఒప్పించారట. వీరిద్దరి లవ్ స్టోరీ మొదలైనప్పటి నుంచి మహేష్ అక్క మంజుల వీరి లవ్‌కి గట్టి సపోర్ట్ గా ఉందని.. మహేష్ – నమ్రతల పెళ్లి జరగడానికి ఆమె కీరోల్ ప్లే చేసిందని సమాచారం. చివరికి వీరిద్దరూ 2005 ఫిబ్రవరి 10న వివాహ బంధంలోకి అడుగు పెట్టారు. ప్రస్తుతం నమ్రత.. మహేష్ బాబు వ్యాపారాలను చూసుకుంటుంది. మహేష్ బాబు గుంటూరు కారం సినిమాలో నటిస్తున్నారు. దీని తర్వాత మహేష్ బాబు – రాజమౌళి కాంబినేషన్లో ఓ సినిమా రాబోతుంది.