‘ గుంటూరు కారం ‘ మ‌హేష్ బ‌ర్త్ డే పోస్ట‌ర్… గ‌ళ్ల లుంగీ.. ఊర‌మాస్‌… రిలీజ్ డేట్ ఇచ్చేశారు..!

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా మీనాక్షి చౌదరి, శ్రీ లీల హీరోయిన్స్ గా నటిస్తున్న సినిమా గుంటూరు కారం. లేటెస్ట్ ఫ్యామిలీ యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందుతున్న ఈ సినిమాలో రమ్యకృష్ణ, ప్రకాష్ రాజు, సునీల్, అలీ, రఘు బాబు, జగపతిబాబు తదితరులు కీరోల్స్ ప్లే చేస్తున్నారు. భారీ బడ్జెట్లో రూపొందుతున్న ఈ సినిమాకు సూర్యదేవర రాధాకృష్ణ ( చిన‌బాబు) ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్నాడు.

హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై ఈ సినిమా రూపొందుతుంది. ఎస్ఎస్ థ‌మ‌న్‌ ఈ సినిమాకు మ్యూజిక్ అందిస్తున్నాడు. గుంటూరు కారం నుంచి ఇప్పటికే మహేష్ బాబు ఫస్ట్ లుక్ మాస్ గ్లింప్స్ రిలీజై కోట్లాదిమంది ప్రేక్షకులను ఆకట్టుకోగా ఈరోజు మహేష్ బాబు బర్త్ డే స్పెషల్‌గా అర్ధ‌రాత్రి మరో స్పెషల్ పోస్టర్‌ని రిలీజ్ చేశారు మూవీ టీం.

ఈ పోస్టర్‌లో మహేష్ లుంగీ కట్టుకొని సన్ గ్లాసెస్ తో స్టైలిష్ గా సిగరెట్ కాలుస్తూ మాస్‌గా కూర్చున్న లుక్ అదిరిపోయింది. ఈ పోస్టర్ తో సినిమాపై ప్రేక్షకుల్లో మరింత ఎక్స్పెక్టేషన్స్ పెరిగాయి. కానీ ఈ సినిమా షూటింగ్ పూర్తయి అన్ని కార్యక్రమాలు ముగించుకోవడానికి 2024 సంక్రాంతి దాకా సమయం పడుతుందట. జనవరి 12న ఈ సినిమాను గ్రాండ్గా థియేటర్స్ లో విడుదల చేయబోతున్నారు.