బాబు ఎంట్రీ తో అక్కడ వైసీపీకి షాక్ లే షాక్ లు..!

ఉమ్మడి నెల్లూరు జిల్లాలో ఉన్న సూళ్ళూరుపేట నియోజకవర్గం..ఒకప్పుడు టీడీపీకి మంచి పట్టున్న స్థానమే. ఇక్కడ మంచి విజయాలే సాధించింది. 1985, 1994, 1999, 2009 ఎన్నికల్లో అక్కడ టి‌డి‌పి గెలిచింది. కానీ గత రెండు ఎన్నికల్లో సూళ్ళూరుపేటలో టి‌డి‌పికి ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. గత రెండు ఎన్నికల్లో వైసీపీ గెలుస్తూ వస్తుంది. అయితే 2014లో కేవలం 3 వేల ఓట్ల తేడాతో గెలిచిన వైసీపీ..2019 ఎన్నికల్లో దాదాపు 61 వేల ఓట్ల మెజారిటీతో గెలిచింది.

Chandrababu Naidu gets invite for national committee meeting - Telangana  Today
అంటే సూళ్ళూరుపేట ప్రజలు వైసీపీకి వన్ సైడ్ గా ఓటు వేసేశారు. జగన్ గాలిలో అంత మెజారిటీ వచ్చేసింది. మరి అంత మెజారిటీతో గెలిపించిన సూళ్ళూరుపేటకు వైసీపీ చేస్తున్నది ఏమన్నా ఉందా? అంటే ఏమి లేదనే చెప్పాలి. ఏదైనా పథకాలు వస్తున్నాయి గాని..అక్కడ స్థానికంగా ప్రజల సమస్యలు పరిష్కరించేది లేదు..అభివృద్ధి లేదు. దీంతో సూళ్ళూరుపేట ప్రజలు నిదానంగా మారుతున్నారు. అదే సమయంలో అక్కడ టి‌డి‌పి అనుకున్న మేర బలపడటం లేదు. దీని వల్ల ఇప్పటికీ అక్కడ వైసీపీకే లీడ్ ఉంది.

ఇటీవల సర్వేల్లో కూడా సూళ్ళూరుపేటలో వైసీపీ గెలవడం ఖాయమని చెబుతున్నాయి. ఇలాంటి తరుణంలోనే చంద్రబాబు సూళ్ళూరుపేటలో ఎంట్రీ ఇస్తున్నారు. ఈ నెల 4వ తేదీన ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి కార్యక్రమంలో పాల్గొనున్నారు. రోడ్ షో, భారీ సభ ప్లాన్ చేశారు. ఇక నియోజకవర్గానికి వచ్చి బాబు..అక్కడ టి‌డి‌పికి కొత్త బలం తీసుకొచ్చే ఛాన్స్ ఉంది.

Chandrababu Naidu, 13 TDP MLAs Suspended from Andhra Pradesh Assembly
వైసీపీ వైఫల్యాలని ఎండగడితే..టి‌డి‌పికి మరింత ప్లస్ అవుతుంది. అదే సమయంలో సూళ్ళూరుపేటలో టి‌డి‌పి అభ్యర్ధిని కూడా ఫిక్స్ చేసేస్తే..పార్టీ శ్రేణులు మరింత దూకుడుగా పనిచేసే ఛాన్స్ ఉంది. దీంతో టి‌డి‌పికి బలం పెరుగుతుంది. అయినా సరే ఇక్కడ వైసీపీని ఓడించడం అంత సులువు కాదు. చూడాలి మరి చంద్రబాబు ఎంట్రీతో సూళ్ళూరుపేటలో టి‌డి‌పి బలం పెరుగుతుందేమో.