ఆ కంచుకోటలని తిరిగి కైవసం చేసుకోనున్న టీడీపీ..!

గత ఎన్నికల్లో జగన్ దెబ్బకు తెలుగుదేశం పార్టీ కంచుకోటల్లో కూడా దారుణంగా ఓడిపోయిన విషయం తెలిసిందే. అసలు పెద్దగా ఓటమి ఎరగని నియోజకవర్గాల్లో కూడా ఓటమి పాలైంది. అయితే అలా కంచుకోటల్లో ఓడిపోయిన టి‌డి‌పి ఇప్పుడు పుంజుకుంటుంది. వైసీపీపై తీవ్ర వ్యతిరేకత వస్తున్న నేపథ్యంలో టి‌డి‌పి బలపడుతూ వస్తుంది. ఈ సారి ఎన్నికల్లో తమ కంచుకోటల్లో మళ్ళీ గెలిచి..వాటిని తిరిగి సొంతం చేసుకోనుంది.

తెలుగుదేశం పార్టీకి సైకిల్ గుర్తు తొల‌గించండి..! ఈసీ కి అందిన ఫిర్యాదు..!!  | Ban the cycle symbol to tdp..! complained to EC..!! - Telugu Oneindia
అలా మళ్ళీ టి‌డి‌పి దక్కే కంచుకోటలు చాలానే ఉన్నాయి..వాటిల్లో ముఖ్యంగా పొన్నూరు ఒకటి అని చెప్పవచ్చు. ఇది పూర్తిగా టి‌డి‌పి కంచుకోట. ఇక్కడ ధూళిపాళ్ళ నరేంద్ర వరుసగా 5 సార్లు గెలిచారు. కానీ గత ఎన్నికల్లోనే తొలిసారి తక్కువ ఓట్లతో ఓడిపోయారు. ఇప్పుడు అక్కడ టి‌డి‌పి బలపడింది..నెక్స్ట్ ఎన్నికల్లో గెలవడం ఖాయమని చెప్పవచ్చు. ఇక చిలకలూరిపేట సైతం టి‌డి‌పి కంచుకోటగా ఉంది. గత ఎన్నికల్లో అక్కడ టి‌డి‌పి ఓడింది. ఇప్పుడు అక్కడ గెలుపు దిశగా వెళుతుంది. అలాగే వేమూరు సైతం టి‌డి‌పికి కంచుకోటగా ఉంది. ఆ నియోజకవర్గంలో ఇప్పుడు వైసీపీకి యాంటీ ఎక్కువ ఉంది.

దీంతో ఈ సారి వేమూరులో టి‌డి‌పి గెలవడం ఖాయంగా కనిపిస్తుంది. ఇక మైలవరం, జగ్గయ్యపేట, నందిగామ నియోజకవర్గాలు సైతం టి‌డి‌పికి కంచుకోటలే. గత ఎన్నికల్లో మూడు చోట్ల టి‌డి‌పి ఓడింది..ఇప్పుడు ఆ మూడు చోట్ల టి‌డి‌పి గెలుపు దిశగా వెళుతుంది. ఇటు దెందులూరు, తణుకు, నిడదవోలు, కొవ్వూరు స్థానాలు టి‌డి‌పికి కంచుకోటలు. గత ఎన్నికల్లో ఓడిన ఈ స్థానాల్లో టి‌డి‌పి వచ్చే ఎన్నికల్లో గెలుపు ఖాయమని చెప్పవచ్చు.


ఇక భీమిలి, నర్సీపట్నం, విజయనగరం, నెల్లిమర్ల, పలాస లాంటి స్థానాలు కూడా టి‌డి‌పి కంచుకోటలుగా ఉన్నాయి. గత ఎన్నికల్లో ఈ స్థానాల్లో టి‌డి‌పి ఓటమి పాలైంది..ఇప్పుడు గెలుపు దిశగా వెళుతుంది. ఇవే కాదు ఇంకా కొన్ని కంచుకోటల్లో టి‌డి‌పి తిరిగి పుంజుకుని గెలుపు దిశగా వెళుతుంది.