ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన మామ కోసం తెరవెనక పాలిటిక్స్ ప్లే చేస్తున్నాడా ? అంటే ప్రస్తుతం అవును అన్న ఆన్సర్లే వినిపిస్తున్నాయి. అల్లు అర్జున్ మామ తెలంగాణలో అధికార బీఆర్‌స్ పార్టీ నేత కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి. ఆయన 2014 ఎన్నికలలో ఇబ్రహీంపట్నం నుంచి బి ఆర్ ఎస్ పార్టీ తరఫున పోటీ చేసి మంచిరెడ్డి కిషన్ రెడ్డి చేతిలో ఓడిపోయారు. ఇక గత ఎన్నికలలో ఆయనకు టికెట్ రాలేదు. అయితే ఈసారి చంద్రశేఖర్ రెడ్డి తన స్వగ్రామం అయిన నల్లగొండ జిల్లాలోని నాగార్జున సాగర్ నుంచి అసెంబ్లీకి పోటీ చేయాలని ప్రయత్నాలు ప్రారంభించారు.
ఈ క్రమంలోనే తన స్వగ్రామం అయిన పెద్దవూర మండలంలోని చింతపల్లి గ్రామంలోని సమీపంలో భట్టుగూడెం వద్ద కంచర్ల కన్వెన్షన్ పేరుతో ఫంక్షన్ హాల్ నిర్మించారు. వెయ్యి మందికి సరిపడే విధంగా ..ఈ ఫంక్షన్ హాల్ నిర్మించారు. ఈ ఫంక్షన్ హాల్ ప్రారంభోత్సవానికి తన అల్లుడైన అల్లు అర్జున్‌తో పాటు జిల్లాకే చెందిన మంత్రి జగదీశ్ రెడ్డిని.. ఇతర బీర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులను ఆహ్వానించారు. ఈ సందర్భంగా పదివేల మందికి పైగా భోజనాలతో పాటు మహిళలకు చీరలు పంపిణీ కార్యక్రమాన్ని చంద్రశేఖర్ రెడ్డి. ఏర్పాటు చేశారు.
వచ్చే ఎన్నికలలో ఆయన తన స్వస్థలమైన నాగార్జునసాగర్ నియోజకవర్గం నుంచి టిఆర్ఎస్ పార్టీ తరపున పోటీ చేయాలని ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో భాగంగానే ఇప్పటికే నియోజకవర్గ వ్యాప్తంగా విస్తృతంగా పర్యటిస్తున్న చంద్రశేఖర్ రెడ్డి ఇప్పుడు ఏకంగా తన అల్లుడు అల్లు అర్జున్ ని కూడా రంగంలోకి దింపారని తెలుస్తోంది. ఇటు అల్లు అర్జున్ కూడా తన మామకు నాగార్జునసాగర్ టికెట్ కోసం కేటీఆర్‌తో లాబీయింగ్ మొదలు పెట్టాడని తెలుస్తోంది.