ఆ అగ్ర‌ నిర్మాత‌కు అమ్మాయిల పిచ్చి… ఒంట‌రిగా రూమ్‌కు ర‌మ్మ‌న్నాడంటూ గుట్టు ర‌ట్టు చేసిన హీరోయిన్..!

సినిమా పరిశ్రమలో క్యాస్టింగ్ కౌచ్ ఉందనేది అందరికీ తెలిసిన పచ్చి నిజం. అది ఇప్పటినుంచే కాదు కొన్ని దశాబ్దాల కాలం నుంచి ఇండస్ట్రీలో కొనసాగుతుంది. అయితే ఇటీవల కాలంలో చాలామంది హీరోయిన్లు బుల్లితెర నటీమణులు కూడా తమకు ఎదురైన చేదు అనుభవాలు.. తమపై జరిగిన లైంగిక వేధింపుల గురించి ఓపెన్ గా మాట్లాడుతున్నారు. మరికొందరు అయితే లైంగిక వేధింపులపై పోరాటం కూడా చేస్తున్నారు.

తాజాగా బాలీవుడ్ నటి శుభ్ మంగళ్ మే దంగ‌ల్ ఫేం సంగీత ఒడ్వాని కూడా తాను ఎదుర్కొన్న క్యాస్టింగ్ కౌచ్ అనుభవాలపై ఓపెన్ అయింది. ఓ అగ్ర నిర్మాత తనను ఒంటరిగా ఇంటికి పిలిచాడని.. తాజా ఇంటర్వ్యూలో వాపోయింది. తన కెరీర్ ప్రారంభంలో ఇండస్ట్రీకి కల్చర్ గురించి పెద్దగా అవగాహన లేదని.. తాను అందరితో సరదాగా ఉండేదాన్ని అని… అయితే కొన్నాళ్లపాటు తనతో మంచిగా నటించిన ఓ అగ్ర నిర్మాత నాతో మిస్ బిహేవ్ చేశాడని వాపోయింది.

ఒకరోజు ఓ ప్రాజెక్టు గురించి చర్చించాలని ఇంటికి ఆహ్వానించాడని.. అయితే తనను ఒంటరిగా మాత్రమే రావాలని పదేపదే చెప్పడంతో నాకు డౌట్ వచ్చిందని ఆమె తెలిపింది. ఎందుకైనా మంచిద‌ని.. తాను తన ఫ్రెండ్స్ ని తీసుకుని ఆయన ఇంటికి వెళ్లానని.. తాను సింగిల్గా వెళ్లకపోవడంతో ఆ నిర్మాతకు తీవ్రమైన కోపం వచ్చిందని.. అర్జెంటుగా వేరే పని ఉందంటూ అక్కడ నుంచి వెళ్లిపోయాడని తెలిపింది.

ఆ తర్వాత కూడా ఆ నిర్మాత తనను ఒంటరిగా కలిసి ఎందుకు చాలా సార్లు ప్రయత్నించాడని.. అయితే నేను మాత్రం అతడిని దూరం పెట్టేసానని చెప్పింది. ఇక ఆ అగ్ర నిర్మాతకు అమ్మాయిలు అంటే పిచ్చి అని… సినిమాల పేరుతో వారిని లొంగదీసుకుంటాడని సంగీత చెప్పుకొచ్చింది.