బ్రహ్మానందంకి కాబోయే చిన్న కోడలు బ్యాక్ గ్రౌండ్ తెలుసా… మీ మైండ్ బ్లాక్ అయిపోతుంది…!

హాస్యబ్రహ్మ బ్రహ్మానందం.. టాలీవుడ్ నెంబర్ వ‌న్ కమెడియన్ అంటే మొదటిగా మనకు గుర్తుకు వచ్చేది బ్రహ్మానందం. బ్రహ్మానందంకి టాలీవుడ్ లో ఉన్న క్రేజ్ గురించి వేరేగా చెప్పాల్సిన అవసరం లేదు. 1250కు పైగా సినిమాల్లో నటించి 2009లో పద్మశ్రీ పురస్కారం అందుకున్న బ్రహ్మానందం.. అన్ని భాషల్లోనూ నటించి 2010లో గిన్నిస్ రికార్డులోకి ఎక్కాడు. బ్రహ్మానందం ఉత్తమ హాస్యనటుడుగా ఎన్నో రకాల పురస్కారాలను అందుకున్నాడు.

Brahmanandam Son: The grand engagement of Brahmanandam's second son.. Who  is the bride? | Brahmanandam Younger Son Siddharth Engagement With Dr  Aishwarya

అస‌లు విష‌యానికి వ‌స్తే బ్రహ్మానందంకు ఇద్దరు కుమారులు ఉన్నార‌న్న విషయం చాలామందికి తెలియ‌దు. బ్రహ్మానందం పెద్ద కుమారుడు గౌతమ్ పల్లకిలో పెళ్లికూతురు సినిమా ద్వారా తెలుగు ఇండస్ట్రీ లోకి వచ్చి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆ తర్వాత కొంతకాలం ఇండస్ట్రీకి దూరంగా ఉన్న గౌతమ్ బసంతి, మను సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నా ఆ సినిమాలు ప్లాప్ కావడంతో ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్నాడు.

ఇక చిన్న కొడుకు ఎప్పుడు తెరపై కనిపించకపోవడంతో చాలామందికి బ్రహ్మానందంకు రెండో కుమారుడు ఉన్నాడ‌న్న విషయం కూడా తెలియదు. ఇటీవల బ్రహ్మానందం చిన్న కొడుకు ఎంగేజ్మెంట్ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవడంతో అతని గురించి మరిన్ని వివరాలు తెలుస్తున్నాయి. బ్రహ్మానందంకి కాబోయే చిన్న కోడలు ఎవ‌రా ? అని ఇప్పుడు నెటిజ‌న్లు ఆరాలు పేరాలు తీస్తున్నారు.

Watch Pallakilo Pellikuthuru Full movie Online In HD | Find where to watch  it online on Justdial

కరీంనగర్ కి చెందిన ప్రముఖ డాక్టర్స్ పద్మజా – వినయ్ దంపతుల కుమార్తె ఐశ్వర్య న‌ట‌. ఆమె గైనకాలజీస్ట్… దాంతోపాటు ఫర్టిలైజ్ష‌న్ స్పెష‌లిస్ట్ గా గుర్తింపు తెచ్చుకుంది. యాక్టర్ ఫ్యామిలీ అయిన‌ బ్రహ్మానందం కుటుంబంలోనికి డాక్టర్ కూడా యాడ్ అవుతోంది. అయితే బ్రహ్మానందం చిన్న కుమారుడికి ఎంగేజ్మెంట్ జ‌ర‌గ‌డంతో బ్రహ్మానందం అభిమానులు, టాలీవుడ్ సినీ జ‌నాలు ఈ జంటకు విషెస్ తెలియజేస్తున్నారు.