దానిమ్మ రాత్రిపూట తినడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయో తెలుసా..?

దానిమ్మ వల్ల ఎన్ని లాభాలు ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పవసరం లేదు. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలిగి ఉన్న దానిమ్మ.. ఐరన్, కాల్షియం, మెగ్నీషియం, జింక్, విటమిన్స్ తో పాటు యాంటీ ఆక్సిడెంట్లను పుష్కలంగా కలిగి ఉంటుంది. సీజన్లతో సంబంధం లేకుండా ఎప్పుడు దొరికే పళలో దానిమ్మ కూడా ఒకటి. రక్తహీనత సమస్య ఉన్నవారు ప్రతిరోజు దానిమ్మ పండ్లను తినడం వల్ల ఆ సమస్యల నుంచి త్వరగా ఉపశమనం లభిస్తుంది. దానిమ్మకాయను తినడం వల్ల రక్తంలో హిమోగ్లోబిన్ లెవెల్స్ పెరగుతుంది.

ఇలాంటి ప్రయోజనాలు ఉన్న దానిమ్మ చూడడానికి ఆకర్షణీయంగా ఉండి గింజలు అద్భుతమైన పోషక విలువలు ఉంటాయి. ఒక దానిమ్మ పండులో సుమారు 600 గింజలు ఉంటాయి. దానిమ్మ పండ్లలో ఏడు గ్రాములు ఫైబర్, 30% విటమిన్ సి, 16% పొటాషియం, 3 గ్రాముల ప్రోటీన్, 24 గ్రాముల చక్కెర ఇవన్నీ ఒక కప్పు దానిమ్మ పండు లో ఉంటాయి. 144 క్యాలరీల శక్తి ఒక్క దానిమ్మ పండు తింటే లభిస్తుంది. రెండు వారాలపాటు రోజు 150 మిల్లి లీటర్ల దానిమ్మ రసాన్ని తాగడం వల్ల రక్తపోటు మెల్లగా తగ్గుతుందని ఇటీవల ఓ ప్రయోగం ద్వారా తెలిసింది.

దానిమ్మ తీసుకోవడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. దానిమ్మలో ఉండే ప్లాన్ ఆయిడ్స్ క్యాన్సర్ రాడికల్స్ ని నివారిస్తుంద వృద్ధాప్యానికి దారి తీసే రాడికల్స్ నుంచి కాపాడి యవ్వనంగా ఉంచేలా దానిమ్మ సహాయపడుతుంది. మలబద్ధకం, ఒబేసిటీ లాంటి సమస్యల దానిమ్మ తినడం వల్ల దూరంగా ఉంటాయి. దానిమ్మ తినడం వల్ల ఆరోగ్యంతో పాటు అందం కూడా ఉంటుంది. చర్మం నిగారింపు సంతరించుకుంటుంది. స్కిన్ టోన్ పెరుగుతుంది. చర్మంపై ముడతలు రాకుండా అడ్డుకుంటుంది. ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ చర్మం తేమ కోల్పోకుండ కాపాడుతుంది.

చాలామంది రాత్రివేళ దానిమ్మ తింటే కపం పడుతుంది, జలుబు చేస్తుంది అని అపోహలో ఉంటారు. కానీ రాత్రిపూట దానిమ్మని తీసుకోవడం వల్ల నిద్రలేమి సమస్య తగ్గుతుంది. ఒక గ్లాసు దానిమ్మ రసంలో టీ స్పూన్ అల్లం వేసుకుని తాగితే కీళ్ల నొప్పులు మోకాళ్ళ నొప్పులతో బాధపడే వారికి మంచి ఔషధంలా పనిచేస్తుంది. ఎముకలు కూడా దృఢంగా ఉంటాయి. నిద్రించే ముందు దానిమ్మను పెరుగులో తీసుకోవడం వల్ల నిద్రలేమి సమస్య ఉండదు. రాత్రిపూట దానిమ్మ తింటే ఉదయం వరకు ఆకలి ఉండదు. తద్వారా బరువు తగ్గాలనుకునే వారికి కూడా దానిమ్మ చాలా ఉపయోగపడుతుంది.