కోలీవుడ్ తలైవార్ సూపర్ స్టార్ రజినీకాంత్ ఇటీవల నటించిన జైలర్ సినిమా సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. రమ్యకృష్ణ, పునీత్ శివకుమార్, మోహన్‌లాల్ కీరోల్స్‌లో నటించిన ఈ సినిమా చారిత్రాత్మక విజయాన్ని సొంతం చేసుకుంది. దీంతో అందరి దృష్టి రజినీకాంత్ నెక్స్ట్ మూవీ (170 వ) పై పడింది. జై భీమ్ దర్శకుడు టీజే జ్ఞానవేలు దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కనుంది.
ఈ సినిమాకు ఇంకా టైటిల్ ఫిక్స్ చేయలేదు. వినాయక చవితి సందర్భంగా సెప్టెంబర్ 19 నుంచి ఈ సినిమా సెట్స్ పైకి రానుంది. ఈ సినిమాలో రజిని ముస్లిం పోలీస్ ఆఫీసర్‌గా నటించబోతున్నట్లు సమాచారం. తలైవర్ 170 సినిమాలో శర్వానంద్ లేదా నాని కీలక పాత్ర పోషిస్తున్నారని ఇప్పటికే కొన్ని రూమర్‌లు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. తాజా అప్డేట్ ప్రకారం శర్వ లేదా నాని కాక రానా దగ్గుపాటి ఈ సినిమాల్లో కీరోల్‌లో నటించబోతున్నాడు అంటూ న్యూస్ వైరల్ అవుతున్నాయి.
రజనీకాంత్ స్క్రీన్ ను పంచుకునే అవకాశాన్ని రాన దగ్గుపాటి అందుకున్నాడట. అయితే ఈ సినిమాలో రానా పాత్రకు సంబంధించిన వివరాలు సీక్రెట్ గా ఉంచారు. తలైవార్ 170లో మలయాళ స్టార్ పాహద్ ఫాజిల్ కూడా ప్రధాన పాత్రలో నటించబోతున్నాడు. లైక ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఈ ప్రాజెక్టును రూపొందిస్తున్నారు. అనిరుధ్ సౌండ్ ట్రాక్ కంపోస్ట్ చేయబోతున్నాడు. మరిన్ని వివరాలు త్వరలోనే మూవీ టీం క్లారిటీ ఇస్తుంది.