పెళ్లి కాకముందే… ఆ వ్యక్తితో డేటింగ్ చేసిన రమ్యకృష్ణ….!!

టాలీవుడ్ మోస్ట్ పవర్ ఫుల్ పాత్రలు చేసిన హీరోయిన్ ఎవరు? అంటే ముందుగా గుర్తుకొచ్చేది హీరోయిన్ రమ్యకృష్ణ. ఈ బ్యూటీ ఒక పాత్ర చేసిందంటే ఆ రోల్‌కే పవర్ వస్తుంది. ఇప్పటి వరకు ఈమె చేసినవన్నీ పవర్ ఫుల్ పాత్రలనే చెప్పుకోవచ్చు. అప్పట్లో నరసింహా సినిమా నుంచి బాహుబలి సినిమా వరకు రమ్యకృష్ణ నటించిన సినిమాలకు మంచి గుర్తింపు ఉంది.

లేడీ ఓరియంట్డ్ సినిమాలలో అలాగే విలన్ గా, హీరోయిన్ గా, ఐటమ్ సాంగ్స్, తల్లి, అత్త పాత్రలు ఇలా ప్రతి ఒక్క పాత్రలో నటించి ఇండస్ట్రీలో ఒక వెలుగు వెలిగిన కథానాయిక రమ్యకృష్ణ. అలాంటి ఈ హీరోయిన్ పెళ్లి కాకముందే ఓ వ్యక్తితో సహజీవనం చేసిందని న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అయితే ఆమె రిలేషన్ లో ఉన్నది మ‌రి ఎవరితోనో కాదు.. తన భర్త కృష్ణవంశీతోనే ఆట. కృష్ణవంశీ, రమ్యకృష్ణ ప్రేమించి వివాహం చేసుకున్న విషయం తెలిసిందే.

ఈ హీరోయిన్ కు ఏజ్ మీద పడ్డ పెళ్లి చేసుకోకుండా సినిమాలు తీస్తూ వచ్చింది. ఆ సమయంలో కృష్ణవంశీ తో డేటింగ్ లో ఉందట. ఈ విషయం ఆమె తల్లిదండ్రుల చెవిన పడడంతో వేరే వ్యక్తితో వివాహం చేసేందుకు ప్లాన్ చేయగా.. వెంటనే తన ప్రియుడుతో చెప్పి హడావిడిగా పెళ్లి చేసుకుందట. ఇది ఎంతవరకు నిజమో తెలియదు కానీ.. ఈ వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.