టైమ్స్ నౌ సర్వేలో వైసీపీకి 24 సీట్లేనా… ఆ ఒక్క సీటు ఎందుకు వేయ‌లేదంటే…!

నేషనల్ మీడియాకు చెందిన టైమ్స్ నౌ ఛానల్ ఇప్పటికే రెండుసార్లు రిలీజ్ చేసిన సర్వేలలో ఏపీలో అధికార వైసిపి ఘనవిజయం.. సాధిస్తుందని వెల్లడించిన సంగతి తెలిసిందే. తాజాగా వెల్లడించిన సర్వేలో ఏపీలో ఉన్న.. మొత్తం 25 లోక్సభ స్థానాలలో 24 ఎంపీ సీట్లు వైసీపీకే వస్తాయని టైమ్స్ నౌ కామెడీ జోస్యం చెప్పింది.

టిడిపికి వస్తే ఒక సీటు రావొచ్చు నట.. జనసేనకు గుండు సున్నా కొట్టేసింది. ఇప్పటికే వైసీపీ సర్కార్ నుంచి టైమ్స్ నౌ కు భారీ ఎత్తున చెల్లింపులు జరిగాయన్న విమర్శలు వస్తున్నాయి. సరే చెల్లింపులు జరిగినప్పుడు పాతిక ఎంపీ సీట్లకు పాతిక ఎంపీ సీట్లు వైసిపి గెలుస్తుందని చెప్పాలి కదా..! మరి ఆ ఒక్క సీటు ఎందుకు టిడిపి ? గెలుస్తుందని చెప్పారు అన్న సందేహాలు కూడా వ్యక్తం అవుతున్నాయి.

కేవలం 25 కు 25 ఎంపీ సీట్లు అంటే ఎక్కడ మొహమాటం అడ్డు వస్తుందో.. జ‌నాల్లో మరీ కామెడీ అయిపోతాం అన్న కారణంతోనే 24 ఎంపీ సీట్లు వేసి సరిపెట్టారని.. లేకపోతే.. ఆ ఒక్క సీటు కూడా వైసిపి ఖాతాలో టైమ్స్ వేసేదే అన్న సెటైర్లు సోషల్ మీడియాలో జోరుగా పడుతున్నాయి. కేవలం వైసీపీ శ్రేణుల్లో మాత్రం ఈ సర్వే చేసి టైమ్స్ నౌ ఇలాంటి ఫలితాలు వెల్లడించి ఉండవచ్చు అని కూడా రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.