రాజ‌శేఖ‌ర్ కూతుళ్ల మ‌ధ్య గ్యాప్ వ‌చ్చింది… శివాత్మిక పోస్టుతో పెరిగిన సందేహాలు…!

ప్రముఖ టాలీవుడ్ స్టార్ యాక్ట‌ర్స్‌ రాజశేఖర్ – జీవితా కూతుళ్ళు శివాని రాజశేఖర్, శివాత్మిక రాజ‌శేఖ‌ర్ ఈ పేర్లకు ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. ఇద్దరు ఒకరి తర్వాత ఒకరు సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి చిన్న చిన్న సినిమాల్లో నటిస్తూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. వారు నటించిన సినిమాలు చిన్న సినిమాలు అయినా వాటితో మంచి మార్కులు సంపాదించి అవకాశాలు దక్కించుకుంటున్నారు.

అలాగే ఇటీవల కాలంలో వరుస ఫోటోషూట్లతో అక్కను మించి చెల్లి.. చెల్లిని మించి అక్క అన్నట్లుగా పోటీపడుతూ అందాలు ఆరబోస్తున్నారు. మొత్తానికి వీరిద్దరూ టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రస్తుతం ఒకే స్థానంలో ఉన్నారు. ఒకరిని మించి మరొకరు టాలెంట్ చూపిస్తున్నారు. ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో బాగా హడావిడి చేస్తూ తమ ఫొటోస్ ను షేర్ చేసుకుంటున్నారు. వీరిద్దరూ కూడా చాలా అన్యోన్యంగా ఉంటూ ఇద్దరు కలిసి దిగిన ఫొటోస్ ని కూడా అప్పుడప్పుడు షేర్ చేసుకుంటూ ఉంటారు.

వీరిద్దరూ మంచి అక్క , చెల్లెళ్ళు అని అన్యోన్యంగా ఉంటారని అందరూ అనుకున్నారు. అయితే తాజాగా శివాత్మిక చేసిన పనికి వీరిద్దరికి మధ్యన వివాదాలు జరిగి ఉంటాయని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇంతకీ విషయం ఏంటంటే ఇటీవల శివాని నటించిన జిలేబి సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాతో పాటు సంతోష్ శోభన్ నటించిన ప్రేమ్ కుమార్ అనే సినిమా కూడా రిలీజ్ అయింది.
శివాత్మిక తన అక్క శివాని నటించిన జిలేబి సినిమాపై ఎటువంటి కామెంట్స్ చేయలేదు.. కానీ సోషల్ మీడియా వేదికగా హీరో సంతోష్ శోభన్ నటించిన ప్రేమ్ కుమార్ సినిమా గురించి తన ఇన్‌స్టా స్టోరీలో పంచుకుంది.

ప్రస్తుతం శివాత్మిక పెట్టిన ప్రేమ్ కుమార్ మూవీ పోస్టర్ తో పాటు ఆమె కామెంట్ సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో.. శివాని సినిమా రిలీజ్ అయినా ఎటువంటి విధంగా స్పందించని నువ్వు ఇతర హీరో సినిమాపై కామెంట్స్ చేశావు.. అంటే మీ ఇద్దరికీ మధ్యన గొడవలు జరిగాయా అంటూ.. మీ అక్క ఎదగడం నువ్వు చూడలేకపోతున్నావా.. అంటూ శివాత్మిక చేసిన పనికి జనాలు ఫైర్ అవుతూ కామెంట్స్ చేస్తున్నారు.