మ‌హిళ‌ల్లో చంద్ర‌బాబు క్రేజ్… మార్పున‌కు గ్రీన్‌సిగ్న‌ల్స్ వ‌స్తున్నాయ్‌..!

టీడీపీ అధినేత చంద్ర‌బాబు నాయుడు.. ఏ చిన్న అవ‌కాశాన్ని కూడా వ‌దులు కోవ‌డం లేదు. ప్ర‌జ‌ల నాడి ప‌ట్టుకునేందుకు ఆయ‌న అన్ని ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో గెలుపే ల‌క్ష్యంగా ఆయ‌న ముం దుకు సాగుతున్నారు. ప్ర‌స్తుతం ఉమ్మ‌డి తూర్పులో ప‌ర్య‌టిస్తున్న చంద్ర‌బాబు.. ఇక్క‌డి ప్ర‌జ‌ల‌తో మ‌మేకం అవుతున్నారు. కొత్తపేట నియోజకవర్గం ఆలమూరులో ఆర్టీసీ బస్సులో నారా చంద్రబాబు ప్రయాణం చేశారు.

`భవిష్యత్‌కు గ్యారెంటీ` ప్రచార కార్యక్రమంలో భాగంగా ఆర్టీసీ బస్సులో చంద్రబాబు ప్రయాణించారు. ఇది ఒక‌ర‌కంగా తొలిసార‌నే చెప్పాలి. గ‌తంలో చంద్ర‌బాబు ఎప్పుడూ నేరుగా ఆర్టీసీ బ‌స్సులో ప్ర‌యాణించి.. మ‌హిళా ప్ర‌యాణికుల‌తో ముచ్చ‌డించిన ప‌రిస్థితి లేదు. మహిళా ప్రయాణికులతో మాట్లాడారు. వారు ఎదు ర్కొంటున్న సమస్యలపై వారితో చర్చించారు. టికెట్ తీసుకుని మరీ ప్రయాణించారు. ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తున్న మహిళా ప్రయాణికులతో వారు ఎదుర్కొంటున్న సమస్యలపై చంద్రబాబు మాట్లాడి తెలుసుకున్నారు.

చంద్రబాబు ఆర్టీసీ బ‌స్సు ఎక్క‌డం చూసిన‌.. మ‌హిళ‌ల సంబ‌రానికి అంతు లేకుండా పోయింది. ఆయ‌నతో వారు చాలా సోష‌ల్‌గా మాట్లాడారు. ఆయ‌న‌ అడిగిన ప్రశ్నలకు వారు సూటిగా సమాధానం చెప్పారు. బస్సు లోని మహిళా ప్రయాణికులను ఒక్కొక్కరినీ చంద్ర‌బాబు పలకరించారు. అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణ సౌకర్యం కల్పించనున్నట్టు చెప్పారు.

అదేవిధంగా వ‌చ్చే ఎన్నిక‌ల్లో విజ‌యం ద‌క్కించుకుంటే.. మ‌హిళా శ‌క్తి పేరిట ప్ర‌తి కుంటుంబానికి మేలు జ‌రుగుతుంద‌న్నారు. ప్ర‌తి కుటుంబంలోని 18 ఏళ్లు నిండిన యువ‌తుల‌కు రూ.1500 చొప్పున‌, అదేవిధం గా ప్ర‌తి ఇంట్లో ఎంత మంది చ‌దువుకునే చిన్నారులు ఉంటే అంద‌రికీ కూడా అమ్మ ఒడి ప‌థ‌కం కింద రూ.15 వేలు అందిస్తామ‌న్నారు. ఏదేమైనా ఏపీ మ‌హిళ‌ల్లో మార్పు అయితే స్పష్టంగా ఉంద‌న్న సంకేతాలు అయితే వ‌స్తున్నాయి.