ఏపీలో వైసీపీ గెలిచేది 24 ఎంపీ సీట్లు కాదు ముచ్చ‌ట‌గా మూడే… సైకిల్ దెబ్బ.. అస‌లు నిజం ఇది..!

తాజాగా టైమ్స్ నౌ సర్వే ఏపీలో అధికార వైసిపి ప్రభ‌జ‌నం మరోసారి కొనసాగుతుందని.. మొత్తం 25 లోక్సభ సీట్లలో 24 సీట్లు ఆ పార్టీ ఖాతాలో పడతాయని.. ఒక సీట్లో తెలుగుదేశం గెలిచేందుకు అవకాశం ఉందని.. జనసేన గుండు సున్నా కొడుతుంది అంటూ ఒక సర్వే వెల్లడించిన సంగతి తెలిసిందే. ఇదే ఛానల్ నాలుగు నెలల క్రితం వెల్లడించిన సర్వేలోను దాదాపు ఇలాంటి ఫలితాలే వచ్చాయి.

ఈ సర్వే చూసిన జనాలు అందరూ కామెడీగా నవ్వుకుంటున్నారు. రాష్ట్రం అంతటా ఆ ప్రాంతం లేదు.. ఈ ప్రాంతం లేదు.. ఆ వర్గం లేదు ఈ వర్గం లేదు.. ఒకే విధంగా ప్ర‌భుత్వంపై జనాల్లో తీవ్రమైన వ్యతిరేకత కనిపిస్తోంది. తాజాగా జరిగిన పంచాయతీ ఎన్నికలలో కడప లాంటి చోట్ల కూడా టిడిపి స్పష్టంగా పై చేయి సాధిస్తే.. వైసిపి ఏటికి ఎదురీదుతున్న వాతావరణం కనిపిస్తోంది.

అలాంటిది వైసిపి 24 ఎంపీ సీట్లు గెలుస్తుందని చెప్పటం ఇది కచ్చితంగా టైమ్స్ నౌ కేవలం వైసీపీ కార్యకర్తలను మాత్ర‌మే సర్వే చేసి చెప్పిందన్న సెటైర్లు కూడా పడుతున్నాయి. ఇదిలా ఉంటే వాస్తవ విశ్లేషణలు.. న్యూట్రల్ సర్వేల ప్రకారం ఇప్పుడున్న పరిస్థితుల్లో వైసిపి కేవలం 3 ఎంపీ సీట్లలో మాత్రమే సునాయాసంగా విజయం సాధిస్తుందని తెలింది.

అది కూడా కడప – రాజంపేట – అరకు మాత్రమే. ఇక నంద్యాల – కర్నూలు – తిరుపతి – ఒంగోలు – నెల్లూరు – నరసరావుపేట లాంటి ఎంపి స్థానాల్లో గట్టి పోటీ ఉంటుందని.. మిగిలిన ఎంపీ సీట్లలో తెలుగుదేశం నూటికి నూరు శాతం విజయం సాధిస్తుందని తేలుతుంది. న్యూట్రల్ సర్వేలు అన్నీ దాదాపు ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నాయి. మరి టైమ్స్ నౌ ఛానల్ కు ప్రతినిధులు ఇంట్లో కూర్చుని సర్వే చేస్తే వైసిపికి 24 సీట్లు వచ్చి ఉంటాయని జోకులు పేలుతున్నాయి.