రాజ‌మౌళి పిలిచి ఛాన్స్ ఇచ్చినా బాహుబ‌లిలో త‌మ‌న్నా పాత్ర వ‌దులుకున్న స్టార్ హీరోయిన్‌…!

చిత్ర పరిశ్రమ అంటేనే ఓ వింత ప్రపంచం.. ఇక్కడ ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరు ? ఊహించలేరు. అప్పటివరకు స్టార్ హీరోలుగా ఉన్నవారు జీరోలుగా మారడం.. జీరోగా ఉన్నవారు స్టార్ హీరోలుగా మారడం ఎవరు ఊహించని విధంగా జరుగుతూ ఉంటాయి. ఒక్క సినిమాతో వారి కెరీర్‌ మార్చేసిన సినిమాలు కూడా ఎన్నో ఉన్నాయి. ఇప్పుడు ఇదే లిస్టులోకి వస్తుంది మిల్కీ బ్యూటీ తమన్నా.. ఈమె కెరియర్ లో ఇప్పటివరకు నటించిన హిట్ సినిమాలన్నీ చాలావరకు వేరే హీరోయిన్లు వదులుకున్న సినిమాలు కావ‌డం విచిత్రం.

तमन्ना को संघर्ष के दौर में मिला बाहुबली का सहारा - Tamanna bhatia is happy  to work in Bahubali

మంచు మనోజ్ హీరోగా వచ్చిన శ్రీ సినిమాతో హీరోయిన్‌గా పరిచయమైన తమన్నా తొలి సినిమాతోనే భారీ ప్లాప్‌ తన ఖాతాలో వేసుకుంది. ఈ సినిమా తర్వాత శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన హ్యాపీ డేస్ సినిమాతో మంచి హిట్ త‌న ఖాతాలో వేసుకుంది. ఈ సినిమాలో తమన్నా పాత్రకి ముందుగా వేరే హీరోయిన్ ను అనుకున్నారట. ఆ హీరోయిన్ నో చెప్పడంతో సినిమాలో తమన్నాకు అవకాశం వచ్చింది.

Rashi Khanna Bio: Age, Affairs, Family, And More - Active Noon

తెలుగు సినిమా చరిత్రలోనే బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచిన బాహుబలి సినిమాలో తమన్నా క్యారెక్టర్ కోసం ముందుగా మరో క్రేజీ భామ రాశీఖన్నాను అనుకున్నారట. ఇదే విషయాన్ని రాజమౌళి కూడా గతంలో జరిగిన ప‌లు ఇంటర్వ్యూలో కూడా చెప్పుకొచ్చాడు. అయితే రాశీఖన్నాకి వాటర్ అంటే భయం అని ..వాటర్ షార్ట్స్ చేయలేని చెప్పడంతో రాజమౌళి ఆమెను సినిమా నుంచి తప్పించి తమన్నాను ఓకే చేశారట.

Tamanna Bhatia REVEALED Bahubali 2 Secrets at Bahubali 2 Clothing Launch -  YouTube

ఈ సినిమా తర్వాత తమన్నా పేరు ఏ స్థాయిలో మారు మోగిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. బాహుబలి సినిమా తర్వాత తమన్నా టాలీవుడ్‌ నుంచి బాలీవుడ్ వరకు వరుస‌ సినిమాల్లో నటిస్తూ బిజీగా మారిపోయింది. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ చిరంజీవితో భోళాశంకర్ సినిమాలో నటిస్తుంది. అంతేకాకుండా బాలీవుడ్ క్రేజీ హీరో విజయ్ వర్మతో డేటింగ్ చేస్తూ హాట్ టాపిక్ గా మారింది.