ఆ హీరోయిన్‌తో మంచు మ‌నోజ్‌కు సీక్రెట్‌ పెళ్లి జ‌రిగిందా…!

మంచు ఫ్యామిలీ నుంచి మోహన్ బాబు తర్వాత ఆయన ఇద్దరు కొడుకులు టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన ఆనుకున్నంత స్థాయిలో సక్సెస్ అవ్వలేకపోయారు. సినిమాలు కన్నా ఈ ఫ్యామిలీ సోషల్ మీడియాలో మాత్రం చాలా క్రేజ్ తెచ్చుకుంది. మంచు హీరోలు వారు చేసే పనులతో ఎప్పుడు సోషల్ మీడియాలో ట్రోలింగ్‌కు గురవుతూ ఉంటారు. ఈ కుటుంబంపై ఎన్ని ట్రోల్స్ వచ్చాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే మ‌నోజ్ ఈ విష‌యంలో కాస్త మిన‌హాయింపుతోనే ఉంటాడు.

Jhummandi Naadam - Rotten Tomatoes

మోహ‌న్‌బాబు, విష్ణు, ల‌క్ష్మిని నెటిజ‌న్లు బాగా ట్రోలింగ్‌కు గురి చేస్తూ ఉంటారు. ఈ ట్రోలింగ్ పై స్పందించిన మంచు విష్ణు పోలీస్‌ కంప్లైంట్ ఇస్తానని ఎంత బెదిరించినా సరే నెటిజన్లు మాత్రం ఆయన మాటలను అసలు పట్టించుకోలేదు. మరి ముఖ్యంగా మోహన్ బాబు హీరోగా వచ్చిన సన్నాఫ్ ఇండియా, అలాగే మంచు విష్ణు నటించిన మోస‌గాళ్లు, జిన్నా సినిమాలు డిజాస్టర్ అవడంతో ఈ ఫ్యామిలీపై సోషల్ మీడియాలో ట్రోల్స్ మరింత పెరిగాయి.

Jhummandi Naadam Manchu Manoj,Taapsee,Mohan Babu

రీసెంట్ గా మంచు మనోజ్ పొలిటిషన్ అయిన భూమా మౌనిక రెడ్డిని రెండో పెళ్లి చేసుకున్న విషయం అందరికీ తెలిసిందే. వీరిద్దరు పెళ్లి చేసుకోక ముందు సోషల్ మీడియాలో మనోజ్ పై ఎన్నో కథనాలు వచ్చాయి. మోహన్ బాబుకి, మంచు విష్ణుకి పెళ్లి ఇష్టం లేదని, అందుకే మంచు లక్ష్మి ఈ పెళ్లి చేస్తుంది అంటూ ఎన్నో వార్తలు వినిపించాయి. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న మంచు మనోజ్ మౌనిక కంటే ముందే తనకి వేరే హీరోయిన్ తో బలవంతంగా పెళ్లి చేశారు అంటూ ఒక షాకింగ్ విషయాన్ని బయట పెట్టారు.

Jhummandi Naadam (2010) - Photo Gallery - IMDb

ఇక అసలు విషయం ఏమిటంటే మంచు మనోజ్ – తాప్సీ కాంబినేషన్లో ఝుమ్మంది నాదం సినిమా . వచ్చిన విష‌యం తెలిసిందే. ఇక ఈ సినిమా విడుదల తర్వాత చాలామంది‘నాకు గతం లో సోషల్ మీడియాలో తాప్సీతో బలవంతంగా పెళ్లి చేసేసారు. ఈ రూమర్ ని చూసి నేను తాప్సి చాలా నవ్వుకున్నాము.. మేమిద్దరం కేవలం స్నేహితులం మాత్రమే, ఒక ఫ్యామిలీ ఫ్రెండ్స్ లాగ కలిసిమెలిసి ఉంటాము, ఒక అమ్మాయి అబ్బాయి అలా కలిసి ఉంటే ప్రేమ, పెళ్లి తప్ప మరో ఆలోచన రాదా’ అని మనోజ్ ఈ సందర్భంగా చెప్పుకొచ్చాడు.