దేవర మూవీ లో ఎన్టీఆర్ కి అత్తగా ఆ స్టార్ హీరోయిన్..!

కొరటాల శివ డైరెక్షన్లో ఎన్టీఆర్ హీరోగా రూపొందుతున్న సినిమా దేవర. ఆచార్య ప్లాప్ తర్వాత కొరటాల శివ డైరెక్షన్లో దేవర సినిమా రూపొందుతుంది. ఈ సినిమాతో ఎలాగైనా హిట్ కొట్టాలనే కసితో ఉన్నాడు కొరటాల. ఎన్టీఆర్ హీరోగా త్రిబుల్ ఆర్ లాంటి పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత భారీ బడ్జెట్‌తో రూపొందితున్న‌ సినిమా కావడంతో దేవర సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ వేగంగా జరుగుతుంది.

ఇక ఎప్పటికప్పుడు ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్ #దేవ‌రా పేరుతో సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉన్నాయి. ఈ సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తున్న సంగతి తెలిసిందే. మరో హీరోయిన్గా రష్మిక మందన్నా, మృణాల్ ఠాగుర్‌ల‌లో ఒకరిని తీసుకోవాలని కొరటాల శివ భావిస్తున్నట్టు న్యూస్ వైరల్ అవుతుంది. ఇంతకీ సెకండ్ హీరోయిన్ ఎవరనేదానిపై ఇంకా క్లారిటీ రాలేదు. ఇక తాజాగా ఈ సినిమాకు సంబంధించిన మరో కీలకమైన న్యూస్ సోషల్ మీడియాలో వినిపిస్తుంది.

ఎన్టీఆర్ అత్త పాత్ర కోసం ఒకప్పటి టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరోయిన్ రమ్యకృష్ణను కొరటాల శివ సెలెక్ట్ చేసుకున్నారంటూ వార్తలు వినిపిస్తున్నాయి. వీరిద్దరి కాంబినేషన్‌లో అత్త, అల్లుళ్ళుగా.. నా అల్లుడు సినిమా రిలీజై ఎంత సక్సెస్ సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ సక్సెస్ఫుల్ కాంబో మరోసారి దేవర సినిమాతో కనిపించబోతుందట. ఈ సినిమాలో జాన్వీకి అమ్మగా రమ్యకృష్ణ కనపడుతోందని.. ఇంటర్వెల్ సీన్ తర్వాత కథ మలుపు తిప్పడానికి రమ్యకృష్ణ పాత్రే కారణమంటూ వార్తలు వినిపిస్తున్నాయి.