ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా దర్శకుడు కొరటాల శివ కాంబినేషన్ లో భారీ పాన్ ఇండియా సినిమా “దేవర” తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా శరవేగంగా జరుగుతుంది. ఇటు దేవరతో పాటు ఆ తర్వాత ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కే సినిమాల్లో కూడా నటిస్తున్నాడు. ఇటు పలు ఎండోర్స్ మెంట్స్ యాడ్స్‌లో కూడా నటిస్తున్నాడు.
ఈ క్రమంలోనే తారక్ ఓ యంగ్ హీరో సినిమా కోసం రంగంలోకి దిగుతున్నాడు. ఆ యంగ్ హీరో చేసిన భారీ సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్‌కు తారక్ ఛీఫ్ గెస్ట్ గా రాబోతున్నాడు. ఆ యంగ్ హీరో ఎవరో కాదు మల్లూవుడ్ క్రేజీ హీరో దుల్కర్ సల్మాన్. దుల్కర్ తాజాగా నటించిన లేటెస్ట్ చిత్రమే “కింగ్ ఆఫ్ కోత”.
ఈ సినిమాపై మంచి అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా తెలుగు ప్రీ రిలీజ్ ఈవెంట్ ఆగస్ట్ 13న జరగనుంది. అయితే దీనికి ఎన్టీఆర్ గెస్ట్ గా వస్తాడని తెలుస్తోంది. ఏదేమైనా ఎన్టీఆర్ ఈసినిమా ప్రి రిలీజ్ ఈవెంట్‌కు గెస్ట్‌గా వస్తే ఆ క్రేజ్ వేరుగా ఉంటుంది.