అక్కినేని అమలతో దిగిన ఫోటో షేర్ చేసిన‌ స్టార్ హీరో… ఇంత‌కి అతను ఎవరో తెలుసా….!

అక్కినేని అమల గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. తన నటనతో, అందంతో ఎంతోమంది అభిమానుల్ని సంపాదించుకుంది. అక్కినేని నాగార్జున ను ప్రేమ వివాహం చేసుకున్న విషయం మనందరికీ తెలిసిందే. పెళ్లి అనంతరం సినిమా ఇండస్ట్రీకి గుడ్ బై చెప్పేసి కుటుంబానికి ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తుంది. ఇదిలా ఉంటే… కోలీవుడ్‌లో “మ్తెథ‌లి ఎన్నె కాదుల్తే ” అనే సినిమాతో తన కెరీర్‌ను మొదలు పెట్టింది.

ఆ తర్వాత బాలీవుడ్ స్టార్ నటుడు సంజయ్ కపూర్ తో ఫోటో షూట్ లో పాల్గొని సందడి చేసింది. అప్పుడు దిగిన ఫోటోలను సంజయ్ కపూర్ తాజాగా సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఇది నా ఫస్ట్ ఫోటో షూట్… అందమైన, తెలివైన‌ అమలతో కలిసి ఈ ఫోటో షూట్‌లో పాల్గొన్నాను. అన్నీ అనుకున్నట్లు జరుగుంటే తనే నాతో కలిసి నటించే తొలి హీరోయిన్ అయ్యేది. కానీ అలా జరగలేదు అంటూ చెప్పుకొచ్చాడు. ఈ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.