ఆ స్టార్ హీరో దగ్గర రూ.25 కోట్ల అప్పు.. గూబ పగిలిపోయే ఆన్సర్ ఇచ్చిన సమంత..!

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత రీసెంట్గా తన మేకప్ ఆర్టిస్ట్, తన స్నేహితురాలు అనుష తో కలిసి బాలి ట్రిప్ లో ఉన్న విషయం అందరికీ తెలిసిందే. అక్కడ ఉన్న ప్రకృతి అందాలను ఎంజాయ్ చేస్తూ ట్రిప్ లో తన బ్యూటిఫుల్ ఫొటోస్ ను ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో తన అభిమానులతో పంచుకుంటూ వారికి మంచి కిక్ ఇస్తుంది. లేటెస్ట్ వార్తల ప్రకారం సమంత మయోసైటీస్ వ్యాధి నుంచి కోలుకునేందుకు అమెరికా వెళ్ళిబోతున్నారు అందుకు కావాల్సిన ట్రీట్మెంట్ ఖర్చులకి రూ.25 కోట్లను ఓ స్టార్ హీరో దగ్గర అప్పుగా తీసుకుందని సోషల్ మీడియాలో గత వారం రోజులుగా ఓ వార్త వైరల్ గా మారింది.

ఇప్పుడు ఆ వార్తపై సమంత సోషల్ మీడియా వేదికగా స్పందించింది. అందుకు సంబంధించి ఓ పోస్ట్ ను రాసుకు వచ్చింది. మయోసైటీస్ చికిత్స కోసం ర‌.25 కోట్ల..? ఎవరో మీకు తప్పుడు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. మీతో తప్పుడు వార్తలు రాయిస్తున్నారు. నేను ఇప్పటివరకు ఆ వ్యాధి కోసం అందులో అతి తక్కువ డబ్బులతోనే చికిత్స తిసుకొని కోలుకొని హ్యాపీగా ఉన్నాను. నన్ను నేను జాగ్రత్తగా చూసుకుంటున్నాను. మయోసైటిస్ నా ఒక్కదానికే కాదు ఎందరో ఈ వ్యాధితో ఇబ్బంది పడుతున్నారు. అంటూ సమంత ఆ వార్తపై తన అసహనాన్ని వ్యక్తపరుస్తూ ఆ పోస్టులో పేర్కొంది.

సమంత అభిమానులకు తన నిజాయితీ నిబ‌ద్ధ‌త‌ పట్ల గౌరవం పెరిగిందని ఆమెపెట్టిన పోస్ట్ ను సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. ఇక ప్రస్తుతం సమంత కొన్ని రోజులపాటు సినిమాలకు విరామం తీసుకుంది త‌న ఆరోగ్యం కోసమే అనే విషయం అందరికి తెలిసిందే. ప్రస్తుతం సమంత- విజయ్ దేవరకొండ తో కలిసి ఖుషి సినిమాలో నటిస్తుంది. ఇక ఈ సినిమా సెప్టెంబర్ లో ప్రేక్షకులు ముందుకు రానుంది. అలాగే బాలీవుడ్ లో కూడా సిటాడెల్ వెబ్ సిరీస్ చేస్తుంది. ఇది కూడా త్వరలోనే ప్రేక్షకులు ముందుకు రానుంది.