జుకర్ బర్గ్ ఏ మొబైల్ వాడతాడో తెలుసా… ఇంతకి ఆ మొబైల్ ఏమిటంటే..!

మెటా సీఈవో మార్క్ జుకర్ బర్గ్ ఉపయోగించే మొబైల్ ఫోన్ గురించి సోష‌ల్ మీడియ‌లో చర్చ మొదలైంది. దీంతో గతంలో ఓ ఇంటర్వ్యూలో ఆయన చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి. అందులో ఆయన తన అభిమాన ఫోన్ బ్రాండ్ గురించి చెప్పడం ఆశ్చర్యం. సెలబ్రిటీలు, ప్రముఖ కంపెనీల సీఈవో లు ఉపయోగించే వస్తువుల గురించి తెలుసుకునేందుకు చాలామంది ఆసక్తి చూపిస్తూ ఉంటారు. అంతేకాదు, దీనికి సంబంధించిన ఎలాంటి సమాచారం అయినా సామాజిక మధ్యమాల్లో వైరల్ గా మారుతూ ఉంటాయి.

గతంలో యాపిల్ సీఈవో టీమ్ కుక్ వాడే ఫోన్ గురించి పెద్ద చర్చ జరిగింది. చివరకు ఆయన ఐఫోన్ వాడుతున్నాడని తెలిసింది. అలాగే గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ శాతం పిక్సెల్ ఫోన్ ఉపయోగిస్తున్నాడని తెలిసింది. తాజాగా మెటా సీఈవో మార్క్ జుకర్ బర్క్ ఫోన్ గురించి సోషల్ మీడియాలో చర్చలు జరుగుతున్నాయి. ఇందుకు కారణం… ఆయన ఓ ఈవెంట్లో ‘చెకింగ్ 13 మెయిల్స్ ఆన్ ది నే టూ ది కన్సర్ట్’ అంటూ ఇన్ స్టా లో మొబైల్ చూస్తున్న ఫోటో షేర్ చేయడమే.

ఇంతకీ ఆయన ఏం ఫోన్ వాడుతున్నాడు తెలుసా? ఆండ్రాయిడ్ మోడల్. బ్రాండ్ ఏంటనేగా మీ సందేహం శాంసంగ్ అయితే, అది ఖచ్చితంగా ఏ మోడల్ అనే దానిపై క్లారిటీ లేనప్పటికీ డిజైన్ పరంగా అది శాంసంగ్ గెలాక్సీ ఎస్21 సిరీస్ లేదా ఎస్ 22 సిరీస్ మోడల్ అయ్యుండవచ్చని నెటిజ‌న్ల‌ అంచనా గతంలో ఓ యూట్యూబ్ ఛానెల్ ఇంటర్వ్యూలో జుకర్ బర్క్ మాట్లాడుతూ.. తనకి ఆండ్రాయిడ్ ఫోన్ అంటే ఎంతో ఇష్టమని చాలాకాలం నుంచి శాంసంగ్ ఫోనే ఉపయోగిస్తున్నానని.. ఆ బ్రాండ్ కు తాను పెద్ద ఫ్యాన్ అని చెప్పుకొచ్చాడు. అంతేకాకుండా ఆఫీసులో తన టీమ్ సభ్యులకు కూడా ఆండ్రాయిడ్ మోడల్స్ ని ఎక్కువగా ఉపయోగించమని సూచిస్తానని చెప్పుకొచ్చాడు.