సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన సినిమాలను సెన్సేషనల్ హిట్ మూవీ చంద్రముఖి కి సీక్వెల్ గా దర్శకుడు పీ వాసు టాలెంటెడ్ హీరో రాఘవ లారెన్స్ తో చంద్రముఖి 2 సినిమా చేస్తున్న విషయం తెలిసింది. ఇక ఈ సినిమా పై మంచి అంచనలు ఉన్నాయి. ఇక రీసెంట్‌గానే ఈ మూవీ నుంచి హరో లారెన్స్ ఫస్ట్ లుక్ ని కూడా మేకర్స్ రిలీజ్ చేయగా.. ఇక దానికి అదిరే రెస్పాన్స్ కూడా వచ్చింది.
ఇక అదే విధంగా ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్ హీరోయిన్‌గా నటిస్తుంది. ఇప్పుడు ఈ సినిమాలోని కంగనా పస్ట్ లుక్‌ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఆ పోస్టర్‌లో కంగన చంద్రముఖి గా చాలా అందంగా ఓ అద్దం ముందు నించుని తనని తాను చూసుకుంటున్న ఉన్న సింపుల్ లుక్ ఎంతో అందంగా ఉంది.
ఇక ఈ చిత్రానికి ఎం ఎం కీరవాణి సంగీతం అందిస్తుండగా.. వచ్చే వినాయక చవితి కానుకగా పాన్ ఇండియా వైడ్ లైకా ప్రొడక్షన్స్ వారు గ్రాండ్ రిలీజ్ చేస్తున్నారు.ఇక మరి సినిమాతో కంగనా- లారెన్స్ ఏ స్థాయిలో ప్రేక్షకులను భయపడతరో చూడాలి.