టీడీపీ యువ నాయకుడు, మాజీ మంత్రి నారా లోకేష్ ప్రతిష్టాత్మకంగా చేస్తున్న పాదయాత్ర యువగళం. ఈ ఏడాది జనవరి 27న ప్రారంభమైన ఈ యాత్ర దిగ్విజయంగా ముందుకు సాగుతోంది. ఇప్పటికి 200 రోజులు కూడా పూర్తి చేసుకుని షెడ్యూల్ కన్నా వేగంగా.. ముందుకు దూసుకుపోతోంది. ముందస్తు ఎన్నిక లు వచ్చినా.. ఇబ్బంది లేకుండా ఉండేలా ఈ పాదయాత్రను ప్లాన్ చేసుకున్నట్టు తెలుస్తోంది.
అందుకే చాలా వేగంగా పాదయాత్రను పూర్తి చేస్తున్నారు. ఇదిలావుంటే… యువగళం పూర్తయిన నియోజక వర్గాల్లో పరిస్థితి ఎలా ఉంది? పార్టీ అధిష్టానం ఆయా నియోజకవర్గాలపై ఎలాంటి దృష్టి పెట్టింది? వంటి వి కీలకంగా మారాయి. వాస్తవానికి యువగళం పాదయాత్ర లక్ష్యం.. వచ్చే ఎన్నికల్లో పార్టీని అధికారంలోకి తీసుకురావడం, చంద్రబాబును సీఎంను చేయడం. ఇవి సాధించేందుకు క్షేత్రస్థాయిలో పార్టీని బలోపే తం చేయాలనేది యువగళం ప్రధాన ఉద్దేశం.
ఈ క్రమంలోనే యువగళం ముగిసిన నియోజకవర్గాల్లోనూ స్థానిక పార్టీ ఇంచార్జ్‌లు, జిల్లా పార్టీల అధ్యక్షు లు కూడా.. యువగళం వేడి తగ్గకుండా చూడాలని, వచ్చే ఎన్నికల నాటి వరకు కూడా.. పార్టీ దూకుడు అలానే ఉండాలని అధిష్టానం నిర్దేశించింది. ఈ క్రమంలో పాదయాత్ర ముగిసిన నియోజకవర్గాల్లో బస్సు యాత్ర చేపట్టారు. ప్రస్తుతం అనంతపురం, కర్నూలు, కడప జిల్లాల్లో బస్సు యాత్ర జోరుగా సాగుతోంది.
భవిష్యత్తుకు భరోసా పేరుతో నిర్వహిస్తున్న ఈ యాత్రలు ప్రజలకు చేరువ అవుతున్నాయి. అదేసమయం లో యువగళం యాత్రలో నారా లోకేష్ ప్రజలకు ఇచ్చిన అన్ని హామీలపైనా నాయకులు వివరిస్తున్నారు. క్షేత్రస్థాయిలో ఆయా హామీలు మరోసారి వారికి వివరించడం ద్వారా.. ప్రజల్లో యువగళం తాలూకు ఉత్సాహం తగ్గిపోకుండా.. పార్టీ అధిష్టానం తీసుకున్న చర్యల్లో భాగంగా దూకుడుగా నాయకులు వ్యవహరిస్తున్నారు. మొత్తానికి యువగళం ముగిసినా.. నియోజకవర్గాల్లో యాత్ర తాలూకు వేడి మాత్రం కొనసాగుతుండడం గమనార్హం.