షూటింగ్‌లోనే ఎన్టీఆర్ కాళ్లు ప‌ట్టుకుని ఏడ్చేసిన స్టార్ డైరెక్ట‌ర్‌… అస‌లేం జ‌రిగింది..!

నందమూరి నట‌సార్వ బౌమ ఎన్టీఆర్ ఈ పేరుకు ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. తెలుగు ప్రజల గుండెల్లో అన్నగారిగా ముద్ర వేసుకున్న ఎన్టీఆర్.. జానపద, పౌరాణిక, సాంఘిక సినిమాలలో కొన్ని వందల సినిమాల్లో నటించారు. అటువంటి ఎన్టీఆర్ కేవలం రాఘవేంద్రరావు దర్శకత్వంలో 12 సినిమాల్లో నటించాడు. వీరిద్ద‌రి కాంబినేష‌న్ లో వ‌చ్చిన‌ 12 సినిమాల్లో 10 సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్స్ కాగా.. రెండు సినిమాలు మాత్రమే ప్లాపులుగా నిలిచాయి. అంటే వీరిద్దరి కాంబినేషన్ ఎంతో బ్లాక్ బస్టర్ కాంబినేషనో తెలుస్తోంది.

NTR-Raghavendra Rao: టాలీవుడ్ బ్లాక్ బస్టర్ కాంబినేషన్ ఎన్టీఆర్,  రాఘవేంద్రరావు.. | ntr k raghavendra rao Tollywood sensational Block Bluster  combination In Telugu Film Industry– News18 Telugu

sr.ntr , ragavendra rao

దాదాపు 12 సినిమాలు కలిసి చేసిన వీరిద్దరి మధ్య ఎంత బాండింగ్ ఉందో అర్దం చేసుకోవ‌చ్చు. అలాంటిది రాఘవేంద్ర‌ రావు ఒకనొక సమయంలో ఎన్టీఆర్ కాళ్లు పట్టుకున్నాడంటు ఒక వార్త ఇటీవల సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. అయితే అంత పెద్ద డైరెక్టర్ సీనియర్ ఎన్టీఆర్ కాళ్లు పట్టుకోవడం ఏంటి..? అసలు ఏం జరిగింది..? అనుకుంటున్నారా సీనియర్ ఎన్టీఆర్ – రాఘవేంద్ర రావు దర్శకత్వంలో వచ్చిన మొదటి సినిమా అడవి రాముడు.

50 ఏళ్ళ క్రితమే ఇప్పటితో పోలిస్తే వందల కోట్ల వసూళ్లు సాధించిన చిత్రమేంటో  తెలుసా.. | sr ntr movie adavi ramudu unknown facts , adavi ramudu, senior  ntr, unknown facts, record collections ...

ఈ సినిమా కోసం రాఘవేంద్రరావు చాలా కష్టపడ్డాడట. సీనియర్ ఎన్టీఆర్ అప్పటికే తిరుగులేని స్టార్ హీరోగా ఉన్నారు. అందుకే ఆయనతో ఏ సీన్ తెరకెక్కించాలన్నా రాఘవేంద్ర రావు చాలా టెన్షన్ ఫీల్ అయ్యేవాడట. ఆ సినిమాలో కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు అనే ఒక పాట ఉంది. అందులో సీనియర్ ఎన్టీఆర్ వాల్మీకి, శ్రీరాముడు, ఏకలవ్యుడు పాత్రల్లో కనిపించాడు.

Adavi Ramudu Telugu Full Movie | NTR | Jayaprada | K. Raghavendra Rao –  Фільмы ў Google Play

ఈ పాటలో శ్రీరాముడు పాత్రలో సీనియర్ ఎన్టీఆర్ గారు నటిస్తుంటే శ‌బ‌రి పాత్రలో ఉన్న ఆమె శ్రీరాముడిని తలెత్తి పైకి చూడకూడదు.. కేవలం శ్రీరాముడి పాదాలు మాత్రమే చూడాలి. అయితే ఈ సన్నివేశాన్ని స్వయంగా రాఘవేంద్ర రావు ఆమెకు చేసి చూపిస్తానని చెప్పి శ‌బరి పాత్రలో చేసి చూపించాడట. ఇక ఆ సీన్ లో భాగంగానే రాఘవేంద్ర‌ రావు సీనియర్ ఎన్టీఆర్ కాళ్లు పట్టుకుని కన్నీరు పెట్టాడట. ఇది అస‌లు విష‌యం.