జూన్‌లో ఏకంగా ఇంత‌మంది టాలీవుడ్ హీరోలు పెళ్లి పీట‌లు ఎక్క‌బోతున్నారా…!

సినీ ఇండస్ట్రీలో చాలామంది నటీనటులు వారి పర్సనల్ విషయాలను కూడా సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటున్నా వారి పెళ్లి విషయాలను మాత్రం సిక్రెట్ గా ఉంచడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. దీని వెనుక ఉన్న రహస్యం ఏంటో తెలియదు గానీ చాలామంది సెలబ్రిటీస్ ఇలానే వారి పెళ్లి విషయాన్ని చెప్పకుండా దాటేస్తుంటారు. జూన్ నెలలో చాలామంది నటీనట్లు పెళ్లి చేసుకోబోతున్నారు. ఈ క్రమంలో జూన్ లో మన టాలీవుడ్ నుంచి ఏ హీరోలు ఎవరిని పెళ్లి చేసుకోబోతున్నారో ఒక లుక్కేద్దాం .

Goodachari': Here's an interesting update about the Adivi Sesh starrer |  Telugu Movie News - Times of India

అడవి శేష్ – సుప్రియ :
అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోయిన్గా పరిచయమైన సుప్రియ తర్వాత ఎటువంటి సినిమాల్లోనూ నటించకుండా కొంతకాలం గ్యాప్ తీసుకుంది. ఇటీవల అడ‌వి శేష్ హీరోగా నటించిన గూఢ‌చారి సినిమాలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఈ సినిమా సూపర్ హిట్ అవడంతో తర్వాత అడవి శేషుకి కూడా వరుస సినిమా ఛాన్సులు వస్తున్నాయి.

ఈ సినిమాలో నటించినప్పుడు సుప్రియ – శేష్ మధ్య స్నేహం ఏర్పడిందని.. ఆ స్నేహం కాస్త ప్రేమగా మారిందని వార్తలు వినిపించాయి. అలాగే అక్కినేని ఫ్యామిలీలో జరిగే ప్రతి ఫంక్షన్ లోనూ అడవి శేష్ పాల్గొనడంతో ఈ వార్తలు మరింత బలపడ్డాయి. ఇక తాజాగా వారిద్దరు ఈనెల జూన్ 16న పెళ్లి పీటలు ఎక్కబోతున్నారంటూ వార్తలు వినిపిస్తున్నాయి.

South Newsmakers: RRR producer's son's marriage, Vijay-Venkat Prabhu film  to Varun Tej-Lavanya's relationship | PINKVILLA

వరుణ్ తేజ్ – లావణ్య త్రిపాఠి :
మెగా హీరో వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి వీరిద్దరి మధ్య ఎఫైర్ నడుస్తుందని వార్తలు ఎప్పటినుంచో వినిపిస్తూనే ఉన్నాయి. అయితే వీరిద్దరూ ఎప్పటికప్పుడు ఈ వార్తలు ఖండిస్తున్నా వీరి మధ్య వస్తున్న వార్తలు ఆగడం లేదు. లావణ్య త్రిపాఠి మెగా ఫ్యామిలీలో జరిగే అన్ని ఫంక్షన్స్ కి అటెండ్ అవుతోంది. దీనికి తోడు నిహారిక ఒక ఇంటర్వ్యూలో భాగంగా తనకు టాలీవుడ్ లో తన అన్నతో నటించిన లావణ్య త్రిపాఠి అంటే చాలా ఇష్టం అని చెప్పడం మ‌రిన్ని అనుమానాల‌కు తావిచ్చింది.

దీంతో పాటు నాగబాబును లావణ్య త్రిపాఠి – వ‌రుణ్ పై వచ్చిన వార్తలపై అడ‌గ‌గా ఈ విషయంలో వరుణ్ తేజ్ కొద్ది రోజుల తర్వాత అధికారికంగా ప్రకటిస్తాడంటూ చెప్పడంతో.. వీరిద్ద‌రి మ‌ధ్య వ‌స్తున్న ప్రేమ వార్త‌లు నిజ‌మే అన్నే అనుమానాలు వ్య‌క్తం చేస్తున్నారు నెటిజ‌న్స్. వీటితో పాటే వచ్చే నెల జూన్ 17న వీరిద్దరూ ఎంగేజ్మెంట్ చేసుకోబోతున్నారంటూ.. తర్వాత నెలలోనే వీరిద్దరు పెళ్లి ఉంటుంద‌ని వార్తలు వినిపిస్తున్నాయి.

Telugu actor Sharwanand gets engaged to Rakshita; Shares adorable pics as  he introduces his 'special one' | PINKVILLA

శర్వానంద్ – రక్షిత రెడ్డి :
యంగ్ హీరో శర్వానంద్ రక్షిత రెడ్డి ఇద్దరు ఎప్పటినుంచో ప్రేమించుకుని.. జనవరిలో ఎంగేజ్మెంట్ చేసుకున్నారు. అయితే జనవరిలో ఎంగేజ్మెంట్ చేసుకున్న ఈ జంట ఇంకా పెళ్లి పీటలు ఎక్కకపోవడంతో.. వీరిద్దరి మధ్య బ్రేకప్ అంటూ పుకార్లు వ‌చ్చాయి. వీటిపై స్పందించిన శర్వానంద్ టీం అనూహ్యంగా వీరిద్దరు పెళ్లి జూన్ లోనే జరగబోతుంది అంటూ క్లారిటీ ఇచ్చింది. ఈ జంట వచ్చే నెల జూన్ 3న పెళ్లి పీటలు ఎక్కబోతున్నారట.