టాలీవుడ్ స్టార్ హీరోపై హన్సిక క్యాస్టింగ్ కౌచ్ ఆరోప‌ణ‌లు… ఇంత దారుణంగా బిహేవ్ చేశాడా..!

సినీ ఇండస్ట్రీలో అన్ని చోట్ల కాస్టింగ్ కౌచ్ ఉన్న సంగతి తెలిసిందే. ఒకప్పుడు క్యాస్టింగ్ కౌచ్ గురించి ఎవరు నోరువిప్పేవారు కాదు.. అయితే సోషల్ మీడియాలో మీ టు ఉద్యమం మోద‌లైన‌ప్ప‌టి నుంచి చాలామంది స్టార్ హీరోయిన్లు.. యాక్టర్స్.. తమకు ఇండస్ట్రీలో త‌మ‌కు ఎదురైన క్యాస్టింగ్ కౌచ్ లైంగిక వేధింపులు, తమ అనుభవాలను వెల్లడిస్తూనే ఉన్నారు. తాజాగా హీరోయిన్ హన్సిక మోత్వాని కూడా ఇండస్ట్రీలో తనకు ఎదురైన క్యాస్టింగ్ కౌచ్‌ అనుభవం గురించి చెప్పుకొచ్చింది.

Top Telugu Movies Of Hansika Motwani – FilmiBeat

చైల్డ్ ఆర్టిస్ట్ గా ఇండస్ట్రీకి పరిచయమైన హన్సిక.. దేశముదురు సినిమాతో తెలుగు ఇండస్ట్రీలో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా ద్వారా ఎంతో మంచి గుర్తింపు తెచ్చుకున్న హన్సిక.. తర్వాత కొన్ని సినిమాల్లో నటించినా ఆమెకు అంతగా క్రేజ్ రాక టాలీవుడ్‌కి దూరమైంది. అయితే కోలీవుడ్‌లో వరుస ఛాన్సులను సంపాదిస్తూ స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. తమిళ ఆడియ‌న్స్ ఆమె నటనకు మెచ్చి గుడి కూడా కట్టారు. కొంతకాలంగా సినిమా ఛాన్సులు లేక ఖాళీగా ఉన్న హన్సిక ఇటీవల తన చిన్ననాటి స్నేహితుడైన సోహెల్‌ను వివాహం చేసుకుంది.

Hansika with Allu Arjun | Hansika Movie Updates

అయితే తాజాగా ఒక ఇంటర్వ్యూలో హన్సిక టాలీవుడ్ లో ఒక స్టార్ హీరోతో తనకు ఎదురైన కాస్టింగ్ కౌచ్ అనుభ‌వం చెప్పుకొచ్చింది. తెలుగులో ఒక స్టార్ హీరో తనని బాగా ఇబ్బందికి గురి చేసాడని.. డేట్ కి వెళ్దాం వస్తావా..? నీకోసం పడకగది సిద్ధంగా ఉంచాను.. అంటూ దారుణంగా కామెంట్స్ చేసేవాడని అసభ్యంగా ప్రవర్తించేవాడని చెప్పుకొచ్చింది.

Crazy (2023) - Movie | Reviews, Cast & Release Date - BookMyShow

అయితే ఆ హీరోకి తగిన రీతిలో బుద్ధి చెప్పానని చెప్పిన హన్సిక.. ఆ హీరో ఎవరు అన్న విషయం మాత్రం బయట పెట్టలేదు. దీంతో హన్సికని అంతగా హింసించిన ఆ టాలీవుడ్ హీరో ఎవరు..? అనే విషయంపై నెటిజన్స్ కి మ‌రింత‌ ఆసక్తి పెరిగింది.