ప్రస్తుతం టాలీవుడ్ టాప్ ఫైవ్ డైరెక్టర్స్ లో త్రివిక్రమ్ శ్రీనివాస్ ఒకరు. ఒక సాధారణ రైటర్ గా కెరీర్‌ను ప్రారంభించిన త్రివిక్రమ్ అప్పట్లో ఎన్నో కల్ట్ క్లాసికల్ మూవీస్ ని అందించాడు. స్వయంవరం, చెప్పవే చిరుగాలి, నువ్వు నాకు నచ్చావు, మన్మధుడు, మల్లీశ్వరి లాంటి ఆల్ టైం క్లాసికల్ హిట్ మూవీలకు రచయితగా వ్యవహరించిన త్రివిక్రమ్ శ్రీనివాస్.. ఆ తర్వాత నువ్వే నువ్వే అనే సినిమాతో మొదటిసారి డైరెక్టర్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. డైరెక్టర్గా మారిన తర్వాత త్రివిక్రమ్ మళ్ళీ వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన పని లేకుండా పోయింది. అతడు జల్సా, జూలాయి, అత్తారింటికి దారేది, అఆ!, అరవింద సమేత లాంటి ఎన్నో బ్లాక్ బాస్టర్ హిట్ సినిమాలను తన ఖాతాలో వేసుకున్నాడు.
అల వైకుంఠపురం సినిమాతో స్టార్ డైరెక్టర్స్ లో ఒకడిగా నిలిచాడు. ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబుతో గుంటూరు కారం సినిమాలో రూపొందిస్తున్నాడు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్. వచ్చే ఏడాది జనవరి 12న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. సంక్రాంతి కానుకగా రిలీజ్ కాబోతున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. ఇక వ్యక్తిగత విషయంలో మాత్రం త్రివిక్రమ్ శ్రీనివాస్ చాలా మంది హీరోయిన్స్ తో లవ్ ఎఫైర్ నడిపాడని ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతూనే ఉంటాయి. సమంత, పూజ హెగ్డే, సంయుక్త మీనన్ లాంటి స్టార్ హీరోయిన్‌లతో త్రివిక్రమ్ శ్రీనివాస్ ఎఫైర్ నడిపాడట.
ఇక పూనామ్ కౌర్ అయితే తనని వాడుకొని అవకాశాలు ఇస్తానంటూ నమ్మించి ఏ అవకాశం ఇవ్వలేదు అంటూ మీడియా ముందే స్వయంగా చెప్పుకొచ్చింది. ఇలా చెప్పుకుంటూ వెళితే త్రివిక్రమ్ గురించి ఎన్నో న్యూస్‌లు వినిపిస్తున్నాయి. కానీ ఒక టాప్ స్టార్ హీరోయిన్‌తో త్రివిక్రమ్ ఫన్నీగా సరదాగా మాట్లాడటం ఆమె ట్రిగ్గర్ అవడం అందరూ చూస్తుండగానే నోరు మూసుకో అని కోపంతో గట్టిగా అరవడం అప్పట్లో ఒక సెన్సేషనల్ న్యూస్ అయ్యింది.
స్టార్ట్ అయిపోయిన తర్వాత బ్రేక్ టైం లో అందరూ కూర్చొని సరదాగా మాట్లాడుతుంటే శ్రీనివాస్ ఆ స్టార్ హీరోయిన్ వ్యక్తిగత జీవితం పై సెటైర్లు వేస్తూ కామెడీ చేశాడట. దీంతో కోపం వచ్చిన ఆ స్టార్ బ్యూటీ నువ్వు డబల్ మీనింగ్ తో మాట్లాడితే అర్థం చేసుకోలేనంత పిచ్చి వాళ్ళు ఎవరు ఇక్కడ లేరు.. మర్యాదగా మాట్లాడు నీ వెకిలి చేష్టలు వేరే ఎక్కడైనా చూపించు.. నా ముందు వేస్తే చెంప పగిలిపోద్ది.. నోరు మూసుకొని ఉండలేవా.. అంటూ చాలా గట్టిగా అందరి ముందే వార్నింగ్ ఇచ్చిందట. అప్పటి నుంచి త్రివిక్రమ్ ఆ స్టార్ హీరోయిన్ మధ్య మాటలు లేవు.