ఇచ్చిన మాట ప్రకారం 100 కుటుంబాలకి అండగా నిలిచిన రౌడీ హీరో..

టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ ఇటీవల నటించిన మూవీ ఖుషి. సమంత హీరోయిన్గా విజయ్ దేవరకొండ హీరోగా నటించిన ఈ సినిమాకు శివ నిర్వాణ దర్శకత్వం వహించాడు. ఈ సినిమా భారీ అంచనాల నడుమ ప్రేక్షకుల ముందుకు వచ్చి మొదటి షో తోనే పాజిటివ్ టాక్ ను సంపాదించుకుంది. ఈ సినిమా మొదటి రెండు రోజులు భారీ కలెక్షన్లను వసూలు చేసి సూపర్ సక్సెస్ అందుకోవడంతో మూవీ స‌క్స‌స్ మీట్ డ్రాండ్‌గా ఏర్పాటు చేశారు.

ఈ ఈవెంట్‌లో విజ‌య్ మాట్లాడుతూ తన ఆనందాన్ని షేర్ చేసుకున్నాడు. తనపై ఇంత ప్రేమను చూపిస్తున్నందుకు ధ‌న్య‌వాదాలు చెప్పిన దేవ‌ర‌కొండా ఫ్యామిలీకి ఒక లక్ష చొప్పున మొత్తం కోటి రూపాయలు తన రెమ్యూనరేషన్ నుంచి 100 కుటుంబాలకు అందిస్తానని మాట ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇక వారెవరో త్వరలోనే తెలియజేస్తానంటూ ఆ సక్సెస్ మీట్ లో విజయ్ దేవరకొండ చెప్పుకొచ్చాడు.

అయితే ఇటీవల ఇచ్చిన మాట ప్రకారం విజయ్ దేవరకొండ వంద కుటుంబాలకి కూడా ఆ మొత్తాన్ని తను అందజేస్తున్నట్లుగా లిస్ట్ ని ఎంపిక చేసి పేర్లతో ఆ లిస్టును పోస్ట్ చేశాడు. ఇది మీ కుటుంబాలకు ఆనందాన్ని కల్పిస్తుంది అనుకుంటున్నాను అని విజయ్ తెలిపాడు. తాను ఇచ్చే ఆ డబ్బులు ఆ కుటుంబాలకు ఉపయోగపడితే చాలని ఆయన పేర్కొన్నాడు. ఇక ప్రస్తుతం ఖుషి సినిమా థియేటర్స్ లో కొనసాగుతూనే ఉంది.