వచ్చే ఎన్నికల్లో టిడిపి – జనసేన కలిసి వెళతాయని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ప్రకటించిన సంగతి తెలిసిందే. శుక్రవారం నుంచి ఉమ్మడి కార్యచరణ ప్రారంభిస్తామని ఓపెన్ గా చెప్పేశారు. ఈ విషయాన్ని ప్రధానమంత్రి మోడీతోపాటు కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ శాఖ కూడా తెలియజేస్తామని బిజెపి సైతం తమతో కలిసి వస్తుందని ఆశిస్తున్నట్టు చెప్పారు. టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తో కలిసి గురువారం టిడిపి అధినేత చంద్రబాబును కలిసిన పవన్ ఆయన ఆరోగ్యంపై ఆరా తీశారు.
సైబరాబాద్ రూపశిల్పి జైల్లో ఉండాల్సి రావటంపై ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం బయటికి వచ్చాక ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ మూలాకత్ ఏపీకి చాలా కీలకమైంది అని చెప్పారు. చంద్రబాబు అరెస్టును సంపూర్ణంగా ఖండిస్తున్నానని.. అలా చెప్పి తాను వెళ్లిపోవడం లేదని పవన్ కుండబద్దలు కొట్టారు. కలిసి వెళ్లాలని ఈ రోజే నిర్ణయం తీసుకున్నట్టు పవన్ చెప్పకనే చెప్పేశారు.
ఇది చంద్రబాబు నా భవిష్యత్తుకు సంబంధించిన విషయం కాదు.. రాష్ట్ర భవిష్యత్తుకు సంబంధించిన అంశం మాతో బిజెపి కలిసి వస్తుందని ఆశిస్తున్నాం అని పవన్ తెలిపారు. అయితే పవన్ మాటలలో ఒక విషయం క్లియర్ గా తెలిసిపోయింది. వచ్చే ఎన్నికలలో తాను తెలుగుదేశంతో కలిసి వెళుతున్నాను.. బిజెపి కలిసి వస్తే ఓకే లేకపోతే బిజెపిని పక్కన పెట్టి అయినా మేం ఎన్నికలకు వెళ్లాలని నిర్ణయించుకున్నట్టు పవన్ క్లియర్ గా చెప్పడంతో పాటు బీజేపీ చెప్పినట్టు తలూపే ప్రశక్తే లేదని బీజేపీకి ఈ భేటీతో పవన్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చినట్టుగా కూడా ఉంది.