చంద్ర‌బాబు అరెస్టు… ఏపీ స‌ర్కార్‌కు బీజేపీ స్ట్రాంగ్ వార్నింగ్‌..!

ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్టు అయిన చంద్రబాబుకు ప్రతిపక్ష పార్టీలకు చెందిన పలువురు కీలక నేతలు మద్దతుగా మాట్లాడుతున్నారు. విచిత్రం ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో ప్రధాన ప్రతిపక్ష నేతలుగా ఉన్న వారందరూ ఇప్పటికే స్పందించి చంద్రబాబు అరెస్టు తీరును తీవ్రంగా ఖండించారు.. తప్పుపట్టారు. తాజాగా తెలంగాణ బిజెపి మాజీ అధ్యక్షులు కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ చంద్రబాబు అరెస్ట్ ఖండిస్తూ తీవ్రంగా విరుచుకుపడ్డారు.

ఇప్పటికే బాబు అరెస్టుపై ఒకసారి స్పందించిన బండి సంజయ్ తాజాగా రెండోసారి స్పందించారు. చంద్రబాబుకు తాజా సంఘటనతో మైలేజ్ చాలా పెరిగిందని బండి జోస్యం చెప్పారు. చంద్రబాబును రాజకీయ కక్షతోనే అరెస్టు చేశారని.. ఎఫ్ఐఆర్లో పేరు లేని వ్యక్తిని అరెస్టు చేయడం ఏంటో ? అర్థం కావట్లేదని బండి వాపోయారు. చంద్రబాబు అరెస్టు వల్ల ఆయనకు మైలేజ్ పెరిగిందని.. ఆయన అరెస్టు అక్రమం అని ఏపీ ప్రభుత్వం. పై ప్రజలు తిరగబడే రోజు దగ్గర్లోనే ఉందని.. ఏపీ ప్రభుత్వానికి బండి సీరియస్ వార్నింగ్ ఇచ్చారు.

ఏది ఏమైనా తెలంగాణలో ఫైర్‌బ్రాండ్‌గా ఉన్న బండి సంజయ్ ఏపీ సర్కార్ కు గట్టి వార్నింగ్ ఇవ్వడం… ఏపీలో ఉన్న బిజెపి నేతలు బిజెపి క్యాడర్ను కూడా ఆలోచింపచేసేలా ఉంది. అలాగే అధికార పక్షంపై పోరాటం చేసే విషయంలో ఏపీ బీజేపీ తెలుగుదేశంతో కలిసి పనిచేయడానికి మరింత స్పూర్తిని నింపినట్లైంది.