మన హిందూ సంప్రదాయంలో మంగళసూత్రానికి ప్రత్యేకమైన గౌరవం ఇస్తాం. మహిళలు దాన్ని ఎంతో పవిత్రంగా చూసుకుంటారు. భార్యాభర్తల శాశ్వత అనుబంధానికి గుర్తుగా దీన్ని ధరిస్తారు. అయితే అత్తవారింటికి గుర్తుగా ఒకటి, పుట్టింటికి గుర్తుగా రెండోది మంగళసూత్రం ఉంటుంది. వీటిని మహిళలు సౌభాగ్యానికి ప్రత్యేకమైన పసుపు, కుంకుమతో నిత్యం పూజ చేస్తారు. అయితే వీటి మధ్యలో ఎరుపు పూసలు, నలుపు పూసలు, పగడాలు, ముత్యాలు వేసుకుంటారు.
కొంతమంది పగడాలు ముత్యాలు యాడ్ చేస్తారు. అయితే మంగళ సూత్రానికి మాత్రం పగడం యాడ్ చేయడం చాలా మంచిదట. దీనికి అసలు కారణం… కుజుడు, చంద్రుడికి ప్రతీకలైన ఈ రెండు రాళ్లు గృహ దోషాలను తొలగించి తమ పసుపు కుంకాలను కాపాడతాయని నమ్ముతూ ఉంటారు. సాధారణంగా స్త్రీలు కుజ గ్రహ ప్రభావం కారణంగా అతి కోపం, కలహాలు, గొడవలు, ఆరోగ్యం లాంటి సమస్యలు వస్తుంటాయి. పగడం ముత్యం ధరించడం వల్ల ఇవేమీ రావని పెద్దవాళ్లు నమ్ముతూ ఉంటారు.