మల్టీ బ్రాండ్ మొబైల్ రిటైల్ చైన్ సెలెక్ట్ మొబైల్ భారత్‌లో తొలిసారిగా “మిషన్ ఇ-వేస్ట్” కార్యక్రమాన్ని ప్రారంభించారు. పరిశుభ్ర వాతావరణాన్ని, జీవన ప్రమాణాలను పెంచే లక్ష్యంతో ఇ-వేస్ట్ను సేకరించి రీసైక్లింగ్ చేపడతారు. ఇందుకోసం కంపెనీ స్టార్లలో బిన్స్ ను ఏర్పాటు చేస్తామని సెలెక్ట్ మెబైల్స్ సిఎండీ వై. గురు తెలిపాడు.
పాడైన వినియోగించని మొబైల్ ఫోన్లు, చార్జర్లు, కంప్యూటర్లు ఇతర ఎలక్ట్రిక్ వస్తువులను తీసుకువస్తే చాలు..రూ.10,000 వరకు డిస్కౌంట్ కూపన్ అందుకోవచ్చు. దేశంలో ఏటా 20 లక్షణ టన్నుల ఈ,వేస్ట్ పొడవుతోందని తెలంగాణ ఐటి పరిశ్రమ శాఖ మంత్రి కే.తారక రామారావు చెప్పాడు. మొత్తం పరిశ్రమలకు మిషన్ ఈ, వేస్ట్ ప్రేరణంగా నిలుస్తుందని సెలెక్ట్ ఈడి మురళి రేతినేని అన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ఐటి ప్రభుత్వాల శాఖ ప్రిన్సిపాల్ సెక్రటరీ జయేశ్ రంజన్ పాల్గొన్నారు.