కిరణ్ రాథోడ్ వారం క్రితం బిగ్‌బాస్ షోలో కంటెస్టెంట్ గా అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. అసలు బిగ్ బాస్ ఎందుకు కిరణ్‌ని కంటిస్టెంట్గా తీసుకోవచ్చాడు.. ఎందుకు ఎలిమినేట్ చేశాడో.. ప్రేక్షకులు అర్థం కాని అయోమయంలో ఉన్నారు. తెలుగు రాకుండా హౌస్ లోకి రావడం ఒక కారణమైతే కిరణ్ సొంత తప్పిదాలకు కూడా ఈ హౌస్ నుంచి వెళ్ళిపోవడానికి కారణం అయ్యాయి. అయితే ఈ వారం రోజులు హౌస్ లో ఉన్నందుకే గట్టిగా రెమ్యునకేషన్ ముట్టినట్లు సమాచారం. ఇంతకీ కిరణ్ రాథోడ్ ఎవ్వరు..? ఎక్కడ చూసినట్టుంది అనుకుంటున్నారా..?
ఈమె తెలుగులో అందరు దొంగలే దొరికితే, భాగ్యలక్ష్మి బంపర్ డ్రా, హై స్కూల్, కెవ్వు కేక ఇలాంటి ఎన్నో సినిమాల్లో నటించింది. 2016లో తమిళంలో ఓ సినిమా చేయగ అది భాజా భజంత్రీలు పేరిట తెలుగులో కూడా రిలీజ్ అయింది. ఆ తర్వాత సినిమాల్లో అవకాశాలు రాకపోవడంతో ఇండస్ట్రీకి దూరమైన కిరణ్ సోషల్ మీడియాలో తన సెమీ న్యూడ్ ఇమేజెస్ పెడుతూ బోల్డ్ బ్యూటీగా పేరు తెచ్చుకుంది. అయితే ఇన్నాళ్లకు బిగ్ బాస్ షో తో ఇండస్ట్రీకి రీఎంట్రీ అవ్వచ్చని ఆశపడింది. అయితే బిగ్ బాస్ 7 లో అడుగుపెట్టిన ఈమె తెలుగు రాకపోవడంతో మొదటి వారంలోనే ఎలిమినేట్ అయింది.
తెలుగు రాకపోవడం ఒక కారణమైతే, బయట ఉన్న కిరణ్ టీం ఆమెకు సంబంధించిన అసభ్య వీడియోలను, ఫోటోలను షేర్ చేస్తూ మరింత కంటెంట్ కోసం యాప్ డౌన్లోడ్ చేసుకోండి అంటూ ప్రచారం చేయడం కూడా దీనికి ఒక కారణం. ఆమె హౌస్‌లో యాక్టివ్గా లేదు ఎవరితోనూ కలవకుండా తనకు తానే ఉన్నట్లు అసలు హౌస్ లోనే ఆమె లేనట్లుగా ప్రేక్షకులు భావించారు. ఈ కారణంతోనే ఆమె హౌస్ లో ఉండడానికి ఓట్లు వేయలేదని సమాచారం. అయితే ఈమె ఉన్న వారం రోజుల్లోనే దాదాపు రూ.3 లక్షల పైచిలుకు రమ్యునరేషన్ అందుకున్నట్లు తెలుస్తుంది. ఈ బోల్డ్ బ్యూటీ కి రోజుకు రూ.45 వేల చొప్పున రెమ్యూనిరేషన్ ఫిక్స్ చేశారట బిగ్‌బాస్ టీమ్.