లేటెస్ట్ ర‌జినీ కాంత్ – లోకేష్ కాంబినేషన్‌లో కొత్త మూవి ఫిక్స్‌..!!

కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్‌ దర్శకత్వంలో సూపర్ స్టార్ రజినీకాంత్ మూవీ పై క్లారిటీ వచ్చింది. ఈ స్టార్ డైరెక్టర్ తలైవర్ 171వ‌ మూవీకి దర్శకత్వం వహించనున్నాడు. ప్రముఖ నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ పతాకంపై ఈ సినిమాను నిర్మించనున్నారు. ఇదే విషయాన్ని మేకర్స్ నేడు తాజాగా వెల్లడించారు.

ఈ విషయంపై డైరెక్టర్ లోకేష్ కనగరాజు ఎక్సైట్ అవుతూ.. ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. సన్ పిక్చర్స్ తో తలైవర్ 171వ సినిమా కోసం రజనీకాంత్ సార్‌తో చేతులు కలపడం ఆనందంగా ఉంది అని అన్నాడు. అన్బు అరివ్ ఈ మూవికి యాక్షన్ డైరెక్టర్స్ గా వ్యవహరించనున్నారు.

రాక్ స్టార్ అనిరుద్ రవి చంద్ర‌న్‌ ఈ సినిమాకి సంగీతం అందించనున్నాడు. ఈ సినిమాపై ప్రేక్షకులలో భారీ అంచనాలు నెలకొన్నాయి. సూపర్ స్టార్ రజినీకాంత్ జైలర్ సినిమాతో భారీ విజయాన్ని సాధించాడు. డైరెక్టర్ లోకేష్ ప్రస్తుతం స్టార్ హీరో విజయ్ తో లియో సినిమాతో బిజీగా ఉన్నాడు.