స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు అరెస్ట్ నేపథ్యంలో ప్రస్తుతం విజయవాడ ఏసిబి కోర్ట్‌లో ఇరు వర్గాల మధ్య వాదనలు ముగిసాయి. ఈ వాదనలు ఎంతో సుదీర్ఘంగా కొనసాగాయి. చంద్రబాబు తరఫున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూద్రా వాదనలు వినిపించారు. ఆంధ్రప్రదేశ్ సిఐడి తరపున ఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదనలు వినిపించారు.
ఈరోజు ఉదయం 8 గంటల తర్వాత ప్రారంభమైన వాదనలు మధ్యాహ్నం 2.30 గంటల వరకు సుదీర్ఘంగా కొనసాగాయి. కోర్టుకు సిఐడి సమర్పించిన రిమాండ్ రిపోర్టుపై ఇరు వర్గాల వాదనలు ఎంతో సుదీర్ఘంగా నడిచాయి. మరికొద్ది సేపట్లోనే ఈ కేసుకు సంబంధించిన తుది తీర్పుు వెలుపడనుంది. విశ్వసినీయవర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం చంద్రబాబుపై పెట్టిన ఈ కేసును కొట్టేస్తారని తెలుస్తుంది. ఇక మరి కోర్ట్ ఏ విధంగా తీర్పు ఇస్తుందో తెలియాలంటే మరికొన్ని నిమిషాలు వేచి చేడాలి.