తిరుమ‌ల‌లో పాప‌ను చంపిన చిరుత‌ను ప‌ట్టేశారు.. ఎలా చిక్కిందంటే…!

ఇటీవల తిరుమలలో చిరుత ఓ బాలికపై దాడి చేసి దారుణంగా చంపేసిన సంగతి తెలిసిందే. ఆ బాలిక మృతి నేపథ్యంలో చిరుతను ఎలాగైనా బంధించాలని ఉద్దేశంతో భద్రతా చర్యలు చేప‌ట్టిన సిబ్బంది ఘటనా స్థలంతో పాటు చుట్టుపక్కల 3 బోన్లతో పాటు కెమెరాలు ఏర్పాటు చేశారు. ఈ టైంలో తిరుమల అలిపరి కాలినడక మార్గంలో 7 మైలు వద్ద ఏర్పాటుచేసిన బోనులో ఈరోజు ఉదయం చిరుత బోనుకి చిక్కింది. అడవి అధికారులు ఆ ప్రాంతానికి చేరుకొని పరిశీలిస్తున్నారు.

శుక్రవారం నెల్లూరు జిల్లాకు చెందిన లక్షిత‌ ఆరేళ్ల బాలికను తన తల్లిదండ్రులతో అలిపిరి కాలినడక మార్గంలో వెళుతుండగా చిరుత దాడి చేసి చంపేసింది. ఈ ఘటన రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ తీవ్ర చర్చనీయాంశం అయింది. దీంతో తిరుమల భద్రత సిబ్బందిపై జనం ఫైర్ అయ్యారు. గతంలో ఓ చిన్నారిపై దాడి చేసిన తర్వాత కూడా భద్రత చర్యలు తీసుకోకపోవడం కార‌ణంగా ఈ ఘటన జరిగిందంటూ తిరుమల భద్రత సిబ్బందిని తిట్టిపోశారు. ఇక చిన్నారిపై దాడి చేసిన ఈ చిరుతను బంధించిన అట‌విశాఖ సిబ్బంది కళ్యాణ్ ట్యాంక్ సమీపంలోని అడవి ప్రాంతంలో విడిచిపెట్టారు.