మేనల్లుడి పెళ్లిలో యంగ్ టైగర్ పెట్టుకున్న వాచ్ ధర తెలిస్తే.. మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే..!

టాలీవుడ్ గ్లోబల్ హీరో జూనియర్ ఎన్టీఆర్ గురించి కొత్తగా పరిచయం అవసరం లేదు.. త్రిబుల్ ఆర్ సినిమాతో ప్రపంచవ్యాప్తంగా భారీ క్రేజ్ తెచ్చుకున్న ఈ హీరో తన మేనల్లుడు వివాహంలో పెట్టుకున్న వాచ్ గురించి సోషల్ మీడియాలో ఇప్పుడు ఎంతో హాట్ టాపిక్ గా మారింది. హరికృష్ణ కుమార్తె నందమూరి సుహాసిని కుమారుడు హర్ష పెళ్లి ఈనెల 20న హైదరాబాద్‌లోని గచ్చిబౌలిలో అంగరంగ వైభవంగా జరిగింది.

ఈ వేడుకకు ఎన్టీఆర్, బాలకృష్ణ, మోక్షజ్ఞ, కళ్యాణ్ రామ్, నంద‌మూరి కుటుంబ సభ్యులతో పాటు నారా చంద్రబాబు నాయుడు, భువనేశ్వరి కూడా హాజరై వధూవరులను ఆశీర్వదించారు. ఈ పెళ్లిలో ఎన్టీఆర్ లుక్ ఆయన పెట్టుకున్న వాచ్ అందర్నీ ఎంతగానో ఆకర్షించింది. ఇక జూనియర్ ఎన్టీఆర్ పెట్టుకున్న ఆ వాచ్ పటేక్ ఫిలిప్ కంపెనీకి చెందిన వాచ్ అని తెలుస్తోంది.

ఇక దీని ధర ఎన్ని కోట్లో తెలిస్తే మీరందరూ నోరెళ్లబెట్టాల్సిందే. ఎందుకంటే దీని ధర అక్షరాల రూ.2.45 కోట్లు అని తెలుస్తోంది. ఇక ఈ వాచ్ ఖరీదు బయటపడడంతో చాలామంది ఎన్టీఆర్ అభిమానులు అలాగే మామూలు జనాలు ఆశ్చర్యపోతున్నారు. ఎన్టీఆర్ పెట్టుకున్న ఒక వాచ్ ఖరీదు తో ఒక కుటుంబం లైఫ్ లాంగ్ చాలాహ్యాపీగా జీవించవచ్చు అంటూ కామెంట్లు పెడుతున్నారు.