గతవారం ఐప్యాక్ చేసిన ఓ సర్వే లీక్ అయినట్టుగా సోషల్ మీడియాలో వైరల్ అయింది. అయితే అది అధికారికంగా ప్రకటించలేదు.. కాబట్టి చాలామంది నమ్మలేదు. ఇక ప్రతి ఆరు నెలలకు మూడ్ ఆఫ్ ది నేషన్ పేరుతో ఇండియా టుడే టీవీ ఛానల్ ప్రకటించే సర్వేలో అదే నిజం అని స్పష్టం అయింది. రాజ్దీప్ సర్దేశాయ్ ప్రకటించిన తాజా సర్వేలో ఏపీలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే అధికార వైసిపి కి దిమ్మతిరిగే షాక్ తప్పదని తేలింది.
టిడిపికి 15 లోక్సభ సీట్లు వస్తాయని సర్వే స్పష్టం చేసింది. ఇండియా టుడే కేవలం లోక్సభ సీట్ల గురించి మాత్రమే తెలిపింది. టిడిపి ఎన్డీఏలో చేరే అవకాశం ఉందని.. ఆ పార్టీ మాత్రమే ఎన్డీఏలో బిజెపి తర్వాత అతిపెద్ద పార్టీగా ఉండబోతుందని కూడా అంచనా వేశారు. ఇదే సర్వేలో ఏడాది కింద టిడిపికి 7 లోక్ సభ సీట్లు వస్తాయని చెప్పారు. ఆ తర్వాత పది సీట్లు వస్తాయి అన్నారు.. ఈ ఆరు నెలల్లో తెలుగుదేశం తన బలం మరింత పెంచుకుని 15 సీట్లకు పెరిగింది.
ఓవరాల్ గా జనసేన పార్టీ ఉనికి అసలు కనిపించడం లేదు. పొత్తులు లేకుండానే తెలుగుదేశం పార్టీకి ఈ ఫలితాలు వస్తాయని ఇండియా టుడే సర్వే స్పష్టం చేసింది. ఇటీవల టైం నౌ ఛానల్ నిర్వహించిన సర్వేలో 25 సీట్లు వైసీపీకే వస్తాయని చెప్పిన సంగతి తెలిసిందే. ఇది చాలా కామెడీ సర్వే అని అందరికి అర్థమైపోయింది. అయితే తాజాగా జరిగిన పంచాయతీ ఉప ఎన్నికల్లో గ్రామాల్లోని వైసిపి పట్టు జారిపోయిందని క్లియర్గా తెలిసింది.
తమ సిట్టింగ్ పంచాయతీలు.. కంచుకోటల్లో కూడా వైసిపి దారుణంగా ఓడిపోయింది. మరోవైపు జగన్ మోహన్ రెడ్డి గ్రాఫ్ దారుణంగా తగ్గిపోతూ వస్తోంది. ఏపీలో ఎన్నికలు జరగడానికి ఇంకా ఎనిమిది నెలల సమయం ఉంది. ఇలాంటి సమయంలో ఇప్పుడే తెలుగుదేశం పార్టీకి ఏకంగా 15 సీట్లు అంటే కచ్చితంగా ఆ పార్టీ అసెంబ్లీ ఎన్నికలలోను వందకు పైగా సీట్లలో విజయం సాధించి అధికారంలోకి వస్తుందని క్లియర్ గా తెలుస్తోంది.