ఈ ఒక్క జాగ్ర‌త్త తీసుకుంటే టాలీవుడ్‌లో ఎన్టీఆర్ నెంబ‌ర్ 1.. ర్యాంక్ కొట్టే హీరోయే ఉండ‌డు..!

95 వ ఆస్కార్ అవార్డుల కార్యక్రమం అంగరంగ వైభవంగా ముగిసింది. మన తెలుగు సినిమా త్రిబుల్ ఆర్ ఉత్తమ సాంగ్ కేటగిరిలో ఆస్కార్ అవార్డు గెలుచుకుంది. మొత్తానికి తెలుగోడి సత్తా ప్రపంచ తెరపై కనిపించింది. అట్టహాసంగా జరిగిన ఈ కార్యక్రమాన్ని ప్రపంచవ్యాప్తంగా 18.7 మిలియన్ల‌ మంది వీక్షించారు. ఈ ప్రోగ్రామ్‌ ప్రత్యక్షంగా ప్రసారం చేసిన ఏబిసి ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించింది. అయితే గత ఏడాదితో పోలిస్తే వీక్షకుల సంఖ్య 12 శాతం పెరిగింది.

RRR or The Kashmir Files, Twitter debates Oscars entry ahead of  announcement | Bollywood - Hindustan Times

ఆస్కార్ అవార్డులు వేడుక సందర్భంగా సోషల్ మీడియా, న్యూస్ మీడియాలో అత్యధికంగా ప్రస్తావించిన నటులు జాబితాలో టాలీవుడ్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ నెంబర్ 1 స్థానంలో నిలిచినట్లు స్పష్టమైంది. ఈ విషయాన్ని సోషల్ మీడియాని విశ్లేషించే నెట్ బేస్ తెలిపింది. ఎన్టీఆర్ తర్వాత ఈ జాబితాలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ రెండో స్థానంలో ఉన్నారు. ఏదేమైనా ఎన్టీఆర్ క్రేజ్ ఏ స్థాయిలో ?ఉందో చెప్పేందుకు ఈ సెర్చింగ్ పెద్ద ఉదాహరణగా నిలిచింది. వాస్తవానికి సోషల్ మీడియాలో ఎన్టీఆర్ కంటే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌, మ‌హేష్‌బాబును ఎక్కువమంది ఫాలోవర్స్ ఉన్నట్టు కనపడతారు.

RRR movie HD images - Ram charan, NTR, Alia bhatt

కానీ ఎన్టీఆర్ అభిమానులు చాలా సైలెంట్ గా ఉంటారు. ఎన్టీఆర్ ఫ్యాన్ ఫాలోయింగ్ కనపడకుండా చాప కింద నీరుల విస్తరిస్తూ ఉంటుంది. 50 ఏళ్లు పైన.. 60 ఏళ్లు పైన ఉన్న వారు కూడా ఎన్టీఆర్‌కు ఎంతోమంది వీరాభిమానులు ఉన్నారు. టైం వచ్చినప్పుడు వారంతా ఎన్టీఆర్‌కు ఏ రేంజ్ లో సపోర్ట్ చేయాలో ? ఆ రేంజ్ లోనే సపోర్ట్ చేస్తూ ఉంటారు. పైగా 22 సంవత్సరాల కెరీర్ లోనే ఎప్పుడు లేనంత ఫామ్ ఎన్టీఆర్ ఉన్నాడు. ఏకంగా 6 వరుస సూపర్ డూపర్ హిట్లు త్రిబుల్ ఆర్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ అయిపోయాడు.

ఇప్పుడు లైన్లో ఉన్న కొరటాల శివ – ప్రశాంత్ నీల్ సినిమాలు కూడా పాన్ ఇండియా లెవెల్లో తెరకెక్కుతున్నాయి. ఈ రెండు సినిమాలు కూడా సూపర్ హిట్ అయితే ఎన్టీఆర్ నెంబర్ వన్ స్థానాన్ని అందుకోవటం ఏ టాలీవుడ్ హీరోకు ఇప్పట్లో సాధ్యం కాదనే చెప్పాలి. అయితే ఎన్టీఆర్ చేయాల్సింద‌ల్లా కథ‌ల ఎంపికలోనూ.. దర్శకుల ఎంపిక లోను జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది. ఈ రెండు విషయాల్లోనూ ఎన్టీఆర్ బ్యాలెన్స్ చేసుకుంటే ఎన్టీఆర్‌కు తిరుగు లేనట్టే.

Tags: film news, filmy updates, intresting news, jr ntr, latest news, latest viral news, social media, social media post, Star hero, telugu news, Tollywood, tollywood news