టీడీపీలోకి వైసీపీ ఎమ్మెల్యేలు… ఆ ఇద్దరే కాదు… వీళ్లు కూడా జంపేనా…!

టీడీపీలోకి వైసీపీ ఎమ్మెల్యేలు..అదేంటి అధికార పార్టీ ఎమ్మెల్యేలు..ప్రతిపక్ష పార్టీలోకి వెళ్ళడం ఏంటి? అని అనుకోవచ్చు..ఎన్నికలకు ఇంకా సమయం ఉంది కదా..ఎన్నికల సమయంలో అంటే జంపింగులు ఉంటాయి..మరి ఇప్పుడే జంపింగులు ఉన్నాయా? అంటే ఉన్నాయనే చెప్పాలి. అధికార వైసీపీపై సొంత పార్టీ నేతలే అసంతృప్తితో రగిలిపోతున్న పరిస్తితి. నియోజకవర్గాల్లో పెద్దగా అభివృద్ధికి నిధులు ఇవ్వకపోవడం..ఎంతసేపు బటన్ నొక్కి పథకాలకు డబ్బులు ఇవ్వడం తప్ప..పన్నుల భారం తగ్గించడం గాని, అభివృద్ధి చేయడం గాని లేదు.

 

దీనిపై పలువురు వైసీపీ ఎమ్మెల్యేలు అసంతృప్తిగా ఉన్న మాట వాస్తవం. ఆ అసంతృప్తిని ఇద్దరు ఎమ్మెల్యేలు ఆల్రెడీ బయటపెట్టేశారు. కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఆనం రామ్ నారాయణ రెడ్డి..ఈ ఇద్దరు వైసీపీపై విమర్శలు చేసి బయటకొచ్చేశారు. ఇద్దరు వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలుగా మారిపోయారు. వీరు టి‌డి‌పిలో చేరడానికి రెడీ అవుతున్నారు.

అయితే వీరే కాదు..ఇంకా ఇద్దరు, ముగ్గురు ఎమ్మెల్యేలు తమతో టచ్ లో ఉన్నారని తాజాగా టి‌డి‌పి సీనియర్ ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప బాంబు పేల్చారు. ఎమ్మెల్యేల కోటాలో 7 ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఒక్కో ఎమ్మెల్సీ స్థానం గెలుచుకోవడానికి 22 మంది ఎమ్మెల్యేలు కావాలి. 6 స్థానాలని వైసీపీ సులువుగా గెలుచుకోగలదు. కానీ 7వ స్థానం కోసం టి‌డి‌పితో పోటీ పడాల్సి ఉంది.

ఇప్పటికే టి‌డి‌పి తరుపున పంచుమర్తి అనురాధ బరిలో ఉన్నారు. ఇక టి‌డి‌పికి 23 మంది సభ్యుల బలం ఉంది..కానీ అందులో నలుగురు వైసీపీ వైపుకు వెళ్లారు. వారు అటు వెళ్ళిన వైసీపీ నుంచి తమకు మద్ధతు ఇచ్చే ఎమ్మెల్యేలు ఉన్నారని రాజప్ప చెప్పుకొచ్చారు. ఎలాగో కోటంరెడ్డి, ఆనం కనిపిస్తున్నారు..మరి వారు కాకుండా ఇంకా వైసీపీ ఎమ్మెల్యేలు టి‌డి‌పితో టచ్ లో ఉన్నారని అంటున్నారు. మరి వైసీపీకి ఇంకా ఎంతమంది ఎమ్మెల్యేలు షాక్ ఇస్తారో చూడాలి.

Tags: AP, ap politics, Favor of TDP, intresting news, latest news, latest viral news, social media, social media post, tdp, telugu news, trendy news, viral news, YS Jagan, ysrcp