సినిమా ఇండస్ట్రీలో ఎప్పుడు పరిస్థితులు ఏ విధంగా మారతాయో అంచనా వేయడం చాలా కష్టం. ఎందుకంటే ఒకప్పుడు సినిమా ఇండస్ట్రీలో ఒక వెలుగు వెలిగిన చాలామంది నటీనటులు ఆ తరువాత కాలంలో సినిమా ఇండస్ట్రీకి దూరం అయ్యి తినడానికి తిండి లేక.. రోడ్డుపై పడుకుని కొంతమంది సెలబ్రిటీలు అయితే.. ఎవరు లేని అనాదులుగా కూడా చనిపోయిన వారు చాలామంది. గతంలో ఓ వెలుగు వెలిగిన చాలామంది సీనియర్ ఆర్టిస్టులు ఇప్పుడు దారుణమైన పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. అటువంటి వారిలో సీనియర్ నటి పాకీజా కూడా ఒకరు. పాకీజా ఇప్పుడు దారుణమైన పరిస్థితులను ఎదుర్కొంటుంది.
అంతేకాకుండా 90 ల కాలంలో తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి లేడీ స్టార్ కమెడియన్ గా ఒక వెలుగు వెలిగింది. 250కు పైగా సినిమాల్లో నటించింది. తన కామెడీతో ఎంతోమంది ప్రేక్షకులను సంపాదించుకుంది. కాగా ఇప్పటికే ఆమె పరిస్థితి చూసి చలించిన చాలామంది సెలబ్రిటీలు తనకి తోచినంత సహాయం చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఆమె పరిస్థితి మరింత దిగజారిందని చెప్పవచ్చు. ఆమె ప్రస్తుత పరిస్థితి కనీసం తినడానికి తిండి లేదు. షుగర్ వ్యాధితో బాధపడుతుంది. కనీసం వేసుకోవడానికి కూడా బట్టలు లేవు. ఒక యూట్యూబర్ ఆమె దీనగాథ వెలుగులోకి తెచ్చాడు.
దీనితో ఆమెకు టాలీవుడ్ నుంచి కొంత సహాయం అందింది. తన సొంత పరిశ్రమ కోలీవుడ్ పట్టించుకోలేదని ఆమె వాపోయింది. మంచు విష్ణు ఆమెకు మా కార్ట్ ఇప్పించాడు. అలాగే మెగా ఫ్యామిలీ ఆర్థిక సహాయం చేసినట్లు సమాచారం. అయినా ఆమె ఆర్థిక ఇబ్బందులు తీరినట్లు కనిపించడం లేదు. ఏకంగా భిక్షాటన చేస్తూ తిరుపతిలో కనిపించింది. అక్కడ దుకాణాల ముందు ఆమె బిక్షాటన చేస్తుండగా కొందరు గుర్తుపట్టారు.
దీంతో ఆమె పరిస్థితి మరోసారి వెలుగులోకి వచ్చింది. కొన్నాళ్లుగా హైదరాబాదులో ఉంటున్న వాసుకీ ఇంటి అద్దె కూడా ఇవ్వలేక అడుక్కుంటుందట. కొన్ని రోజుల క్రితం ఆమె జబర్దస్త్ లో మెరిశారు. ఒకప్పుడు స్టార్ కమెడియన్ గా వెలుగు వెలిగిన ఆమె ఇప్పుడు తిరుపతిలో దుకాణాల ముందు అడుక్కుంటూ అలా కనిపించడంతో చాలామంది తమ కనీళ్ళు పెడుతున్నారు.