నంద‌మూరి స‌రికొత్త రాజ‌కీయం… ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల్లోకి నారా బ్రాహ్మ‌ణి… !

టిడిపి అధినేత చంద్రబాబు స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్టు అయిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయన రాజమండ్రి సెంట్రల్ జైలలో ఉన్నారు. చంద్రబాబుకు బెయిల్ వస్తుందా రాదా అన్న సస్పెన్స్ ?అయితే కొనసాగుతూ వస్తోంది. ఇది ఇలా ఉంటే నిన్న చంద్రబాబు భార్య భువనేశ్వరి తో పాటు చంద్రబాబు కోడలు బ్రాహ్మణి ఇద్దరూ కూడా చంద్రబాబుతో ములాఖత్ అయ్యారు. అటు కుటుంబ వ్యవహారాలతో పాటు ఇటు పార్టీ వ్యవహారాలు ఇతర అంశాలపై కూడా వీరి మధ్య చర్చికి వచ్చినట్టు తెలుస్తోంది.

ఏపీలో వచ్చే సాధారణ ఎన్నికలకు మరో ఏడు నెలల సమయం మాత్రమే ఉంది. దీంతో ఇకనుంచి భువనేశ్వరి, బ్రాహ్మణి ఇద్దరూ కూడా ప్రజాక్షేత్రంలోనే ఉండనున్నట్టు తెలుస్తోంది. అవసరం అయితే నారా బ్రాహ్మణి వచ్చే ఎన్నికలలో ప్రత్యక్ష ఎన్నికల బరిలోకి కూడా దిగుతారని తెలుస్తోంది. ఎన్నికలు ముగిసే వరకు చంద్రబాబు కుటుంబం మొత్తం ప్రజల్లో ఉంటే ఆ ప్రభావం వేరుగా ఉంటుందన్నది ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.

పైగా భువనేశ్వరి, బ్రాహ్మణి ఇద్దరు మహిళలు కావడంతో మహిళల్లో కూడా సింపతి బాగా పెరుగుతుందన్న అంచనాలు అయితే ఉన్నాయి. ఇక బ్రాహ్మణి గుంటూరు నుంచి లోక్సభకు పోటీ చేస్తే ఎలా ? ఉంటుందన్న దానిపై పార్టీ కీలక నేతల మధ్య చర్చలు నడుస్తున్నాయి. ఎలాగూ గుంటూరు లోక్‌స‌భ పరిధిలో ఉన్న మంగళగిరిలోనే లోకేష్ అసెంబ్లీకి పోటీ చేయనున్నారు. అలాగే గుంటూరు నుంచి ఎంపీగా బ్రాహ్మణి పోటీ చేస్తే ఆ ప్రభావం కృష్ణ, గుంటూరు, ప్రకాశం జిల్లాలపై చాలా బలంగా పనిచేస్తుందన్న అంచనాలు పార్టీ వర్గాల్లో ఉన్నాయి.

ప్రస్తుతం గుంటూరు నుంచి టిడిపి సీటింగ్ ఎంపీగా ఉన్న జయదేవ్ ఈసారి ఎంపీగా పోటీ చేయరని తెలుస్తోంది. ఆయన రాజ్యసభకు వెళతారా లేదా రాజకీయంగా ఎలాంటి ? నిర్ణయం తీసుకుంటారన్న సస్పెన్స్ అయితే ఉంది. ఈ సమయంలో అక్కడి నుంచి బ్రాహ్మణిని పోటీ చేయించాలని పార్టీ పెద్దలు ప్రతిపాదనలు చేస్తున్నారు. ఏది ఏమైనా ఈసారి నందమూరి కుటుంబ రాజకీయం అయితే సరికొత్తగా ఉండబోతుంది అన్నది వాస్తవం.